ఆ టైం లో నన్ను అంతా పిచ్చోడి మాదిరి చూసారు..నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్..!!
ఆ టైమ్‌లో నన్నందరూ పిచ్చోడ్ని చూసినట్టు చూశారు. నిజానికి అవేం నేను పట్టించుకోను. నాకు నచ్చింది చేస్తాను. అంతే..' అంటూ తాజాగా రానా దగ్గుబాటి షోలోచెప్పుకొచ్చారు నాగచైతన్య.ఇక ఇందులో రానా.. 50 ఏళ్ల తరువాత నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావ్ అని చైని అడగగా.. ” ఇద్దరు పిల్లలు.. సక్సెస్ ఫుల్ లైఫ్. సక్సెస్ అంటే ఏంటో అనుకుంటారు. నా దృష్టిలో సక్సెస్ అంటే.. జీవితంలో నువ్వు సంతోషంగా ఉంటే అదే సక్సెస్.50 ఏళ్ళ వయస్సులో ఇద్దరు పిల్లలతో నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. నా కొడుకును రేస్ ట్రాక్ కు తీసుకెళ్లి తనతో రేసింగ్ చేస్తాను.. అదే కూతురు అయితే తనకు ఎందులో ఇష్టముందో అందులో ఎదగమని ప్రోత్సహిస్తాను” అని చెప్పుకొచ్చాడు.అంటే.. చై కు తండ్రిగా మారాలని చాలా కోరికగా ఉంది.. త్వరలోనే అది నిజం అవ్వాలని కోరుకుంటున్నామని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. చై కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కు రెడీ అవుతుంది.