పుష్ప 2: డిప్రెషన్‌ లోకి వెళ్లిన మెగాహీరో ?

Veldandi Saikiran
పుష్ప-2 సినిమా ఎంత పెద్ద సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా నటించింది. ఫాహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, రావు రమేష్, జగపతిబాబు కీలక పాత్రలను పోషించారు. శ్రీ లీల స్పెషల్ సాంగ్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్, పోస్టర్స్ తో భారీ హైప్ వచ్చింది. దానికి తగినట్లుగానే పుష్ప-2 థియేట్రికల్ నాన్ థియేట్రికల్ రైట్స్ కు విపరీతమైన పోటీ ఏర్పడింది.


దానివల్ల ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రూ. 620 కోట్ల షేర్ రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు టార్గెట్ గా పెట్టుకున్నారు. ఏకంగా ఈ సినిమా 1200 థియేటర్లలో రిలీజ్ అయింది. కేవలం మూడు రోజుల్లోనే రూ. 600 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి పుష్ప-2 సినిమా రికార్డులను సృష్టిస్తోంది. అంతేకాకుండా ఫాస్టెస్ట్ గా రూ. 600 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రియేట్ చేసిన సినిమాగా రికార్డుల్లో నిలిచింది.

ఇప్పటివరకు ఈ రికార్డు 2017లో రిలీజ్ అయిన బాహుబలి 2 సినిమా పేరిట ఉండేది. బాహుబలి 2 సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 600 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించగా....పుష్ప-2 ది రూల్ కేవలం మూడు రోజుల్లోనే ఆ మార్కును క్రాస్ చేసింది. కాగా, సంక్రాంతి కానుకగా రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా విడుదల కాబోతోంది.


ఈ సినిమా ఎలా కలెక్షన్స్ రాబడుతుందో అని మెగా హీరో రామ్ చరణ్ భయపడి పోతున్నారట. అంతేకాకుండా తన అభిమానులు సైతం పుష్ప-2 సినిమా కన్నా ఎక్కువ కలెక్షన్లను రాబట్టాలని తెగ ఆరాటపడుతున్నారట. అయితే పుష్ప-2 సినిమా కన్నా ఎక్కువ కలెక్షన్లు రావని రామ్ చరణ్ కాస్త భయంలో ఉన్నాడట. ఈ విషయం తెలిసిన అభిమానులు కాస్త టెన్షన్లో ఉన్నారట. ఎలా అయినా ఎక్కువగా కలెక్షన్లు రాబట్టాలని గేమ్ చేంజర్ చిత్ర యూనిట్ భావిస్తుందట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: