సీనియర్ హీరోయిన్ విజయశాంతిని హీరోయిన్గా పరిచయం చేసింది ఎవరంటే..?

Amruth kumar
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ లో ఒక్కరో ఇద్దరో తెలుగు హీరోయిన్లు కనిపిస్తే .. మన తెలుగు అమ్మాయి అంటూ ఇష్టం గా చెప్పుకునే   కల్చర్   మనకు వచ్చింది .. అయితే ఒకప్పుడు టాలీవుడ్ లో చాలా మంది తెలుగు హీరోయిన్లు ఉండేవారు .. అలాగే స్టార్ హీరోల సినిమాల్లో నటించి సూపర్ విజయాలు అందుకుని అగ్ర హీరోయిన్‌లు గా  గుర్తింపు తెచ్చుకున్నారు .  అలాంటి వారిలో లేడి అమితాబచ్చన్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి కూడా ఒకరు .. లేడీ ఓరియంటెడ్ సినిమాల కు ప్రాణం పోసిన‌ హీరోయిన్ ని కూడా విజయశాంతి ని చెప్పుకుంటారు .


 అయితే ఈమె చిత్ర పరిశ్రమ కు పరిచయం చేసింది లేడీ కెప్టెన్ విజయనిర్మల .. ఇదే విషయాన్ని విజయశాంతి పలుమార్లు స్వయంగా చెప్పుకొచ్చింది . ఇక నన్ను ఒక కళాకారిణిగా విశ్వసించి కృష్ణ గారి తో హీరోయిన్ గా నా మొదటి తెలుగు సినిమా కు నన్ను నడిపించింది విజయనిర్మల గారు అంటూ విజయశాంతి ఎప్పుడూ తన గతాన్ని గుర్తు చేసుకుంటుంది . జూన్ 24 , 1966 లో వరంగల్లో అనపర్తి కి చెందిన తెలుగు కుటుంబాని కి అప్పటి మద్రాస్ లో జన్మించారు విజయశాంతి .


అలాగే 1980 లో ఖిలాడీ కృష్ణుడు సినిమా తో సూపర్ స్టార్ కృష్ణ కి జంట గా తెలుగు తెర‌కు పరిచయమై ఎన్నో సినిమా లో నటించారు .. అలాగే టాలీవుడ్ లో దాదాపు అందరి స్టార్ హీరోల కి జంట గా నటించారు .. అలాగే 2020 లో మహేష్ బాబు సరిలేరు నీకు ఎవరు సినిమా తో రీయంట్రి ఇచ్చారు .. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తో కలిసి ఒక సినిమాలో విజయశాంతి నటిస్తున్నారు . ఇలా విజయశాంతి సినిమాల్లో సక్సెస్ఫుల్ హీరోయిన్గా దోచుకుపోయి రాజకీయాల్లో కూడా రాణించారు .. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస‌ సినిమాల్లో నటించడానికి ట్రై చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: