ప్రభాస్ తో రిషబ్ శెట్టి సినిమా..ఇండస్ట్రీ షేక్ కావడం పక్కా?

Veldandi Saikiran
ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కృష్ణంరాజు వారసుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయమైన ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అనంతరం బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్రభాస్ నటనకు ఎంతోమంది అభిమానులు, అభిమాన సంఘాలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు.

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ది రాజా సాబ్. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2025 ఏప్రిల్, 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు కేవలం చిన్న సినిమాలకే దర్శకత్వం వహించిన మారుతి ఒక్కసారిగా పాన్ ఇండియా సినిమాను తీస్తున్నారు. దీంతో అందరిచూపు మారుతీ పైనే పడింది.

ఇదిలా ఉండగా.... ప్రస్తుతం ప్రభాస్ నటుడు, దర్శకుడు అయినటువంటి రిషబ్ శెట్టి చెప్పినటువంటి ఓ కథలో నటించడానికి సిద్ధమయ్యారట. గత కొద్ది రోజులుగా రిషబ్ శెట్టి ఈ కథ గురించి పని చేస్తున్నారు. కేజిఎఫ్ మరియు కాంతార వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించిన హోం భలే సంస్థతో ప్రభాస్ మూడు సినిమాలు చేయడానికి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అందులో భాగంగా ప్రభాస్ ఇమేజ్ ని మరింత పెంచేలా స్క్రిప్ట్ ని సిద్ధం చేయాలని అనుకుంటున్నారట.

దానికోసం రిషబ్ శెట్టి ని ఓ మంచి కథను అందించమని కోరారట. అతను తప్పకుండా మంచి కథను ఇస్తానని హామీ ఇచ్చాడట. కానీ ఆ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడని టాక్ వినిపిస్తోంది. మరి ఆ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారో అని ప్రతి ఒక్కరూ ఆలోచనలో పడుతున్నారు. ఏది ఏమైనాప్పటికీ రిషబ్ శెట్టి అందించే కథలో ప్రభాస్ నటించనున్నాడని తెలిసి అభిమానులు తెగ సంతోషపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: