15 సంవత్సరాలకే స్టార్ హీరోయిన్ .. 100కు పైగా సినిమాలు .. ఇప్పుడు ఎక్కడ ఉంది..?
ఇక ఆ తర్వాత 1993లో ఇవివి సత్యనారాయణ తెరకెక్కించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది .. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించింది. అలాగే మెగాస్టార్ చిరంజీవికి జంటగా బావగారు బాగున్నారా, బొంబాయి ప్రియుడు , ముద్దుల ప్రియుడు , అల్లుడా మజాకా , అల్లరి ప్రేమికుడు వంటి ఎన్నో హిట్ సినిమాలు నటించింది. అలాగే బాలకృష్ణకు జంటగా భైరవ దీపం సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నటించింది . అలాగే అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాలో స్పెషల్ సాంగ్‌లు అలరించింది రంభ.
ఇక చివరిగా పెన్ సింగం సినిమాలో నటించింది .. 2010లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్ర కుమార్ పద్మనాభన్‌ను వివాహం చేసుకొని సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో ఉంటుంది .. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూ తన అభిమానులను అలరిస్తుంది. ఇక మరి రంబ రాబోయే రోజులైనా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతుందో లేదో చూడాలి .. ఇదే క్రమంలో గత కొన్ని రోజులుగా రంభ డైవర్స్ తీసుకోబోతుందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజముంది అనేది మాత్రం ఎవరికీ తెలియదు.