50 ఏళ్ల ముసలోడితో బాలయ్య హీరోయిన్ సీక్రెట్ రిలేషన్ ?
మొదట మలయాళంలో కొన్ని సినిమాలు చేసింది. అనంతరం తమిళం, తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కొన్ని సినిమాలలో కీలక పాత్రలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. అనంతరం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణకు మరదలు పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా అనంతరం హనీకి విపరీతంగా ఫ్యాన్ బేస్ పెరిగింది. వరుస పెట్టి సినిమాలలో నటించే అవకాశాలను అందుకుంది.
సినిమాలలో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో నటించింది. అంతేకాకుండా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ వంటి కార్యక్రమాలలోనూ చురుగ్గా పాల్గొంది. సోషల్ మీడియాలోనూ విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తన అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది. రోజు ఏదో ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తోంది. ఇదిలా ఉండగా.... తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.
హనీ రోజ్ ఇప్పటివరకు వివాహం చేసుకోలేదు. కొంతమందితో ఎఫైర్లు ఉన్నట్టుగా అనేక రకాల వార్తలు వచ్చినప్పటికీ వాటిపై ఇప్పటి వరకు హనీ రోజ్ క్లారిటీ ఇవ్వలేదు. కాగా, హనీ ఏకంగా 50 ఏళ్ల వయసున్న వ్యక్తితో సీక్రెట్ గా రిలేషన్ కొనసాగిస్తుందట. అతడిని వివాహం చేసుకోవాలని అనుకుంటుందట. ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనే విషయాలు బయటకు రానప్పటికీ ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది.