పుష్ప 3.. పుష్ప రాజ్ ఒక్కడే..?

shami
పుష్ప 2 ఎండింగ్ లో పుష్ప 3 ర్యాంపేజ్ అంటూ సుకుమార్ ట్విస్ట్ తెలిసిందే. పుష్ప 1 కన్నా పుష్ప 2 కథలో వీక్ అన్న ఆడియన్స్ ఉన్నారు. కేవలం అల్లు అర్జున్ ఎలివేషన్స్ కోసమే దీన్ని వాడుకున్నారు. అందులో నిజం ఉన్నా కూడా పుష్ప రాజ్ పూనకాలు తెప్పించే పర్ఫార్మెన్స్ దాన్ని మాక్సిమం కవర్ చేసింది. ఇక పుష్ప 3 ర్యాంపేజ్ ఎలా ఉంటుంది అని అల్లు ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ఐతే పుష్ప 3 లో అల్లు అర్జున్ ఒక్కడు మాత్రమే ఉంటాడు.
అదేంటి అంటే పుష్ప 2 ఎండింగ్ లో పెళ్లిలో బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. అందులో దాదాపు పుష్ప రాజ్ ఫ్యామిలీ మొత్తం చనిపోతుంది. శ్రీవల్లితో పాటు కడుపులో బిడ్డ కూడా మృతి చెందడంతో పుష్ప రాజ్ కి పూనకాలు వచ్చేస్తాయి. ఇక ఆ టైం లో అతని అసలు సిసలు ర్యాంపేజ్ ని మొదలు పెడతాడు. పుష్ప 2 గ్లింప్స్ గా వదిలిన పుష్ప రాజ్ మిస్సింగ్ పార్ట్ 3 లోనే ఉంటుంది. అడవికి వెళ్లిన పుష్ప రాజ్ ఏం చేశాడు. సిండికేట్ అంతా కలిసి అతని మీద ఎటాక్ చేస్తే ఎలా తిరగబడ్డాడు.
సెంట్రల్ మినిస్టర్ పుష్ప రాజ్ పెట్టుకున్న పగకి పుష్ప రాజ్ ఎలా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు అన్నది పుష్ప 3 ర్యాంపేజ్ కథ. ఐతే తెలుస్తున్న సమాచారం ప్రకారం పుష్ప 3 సినిమా పుష్ప పాత్ర కూడా ఎండ్ అవుతూ అంటే చనిపోతుందని అంటున్నారు. ఊర మాస్ యాటిట్యూడ్ తో పుష్ప రాజ్ ఇచ్చిన మాస్ ట్రీట్ అంతా ఇంతా కాదు. ఐతే పుష్ప 3 మాస్ ర్యాంపేజ్ తో పాటు ఎమోషనల్ రైడ్ కూడా ఉంటుందని తెలుస్తుంది. మొత్తానికి పుష్ప 3 విషయంలో సుకుమార్ ప్లాన్ కూడా నెక్స్ట్ లెవెల్ అని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: