సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ చిన్న విషయం మీడియాలో చక్కర్లు కొట్టినా కూడా దానిపై ట్రోల్స్, మీమ్స్ వస్తున్న సంగతి మనకు తెలిసిందే.ముఖ్యంగా తండ్రి కూతుర్లను, అన్నాచెల్లెళ్లను కూడా పక్కపక్కన పెట్టి బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ట్రోల్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇది ఎక్కువగా సెలబ్రిటీల విషయంలో జరుగుతుంది.ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారికి ఈ ట్రోల్స్ ఏ విషయంలోనైనా సరే ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. అయితే తాజాగా అక్కినేని నాగార్జున ట్రోల్స్ కి గురయ్యారు. మరి ఆయన ట్రోల్స్ బారిన పడడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. అక్కినేని నాగార్జున తన పెద్ద కొడుకు నాగచైతన్య శోభిత ధూళిపాళ్లల పెళ్లిని అన్నపూర్ణ స్టూడియోలో తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు డిసెంబర్ 4న అంగరంగ వైభవంగా జరిపించిన సంగతి మనకు తెలిసిందే..
అయితే డిసెంబర్ 4న పెళ్లి జరిగిన వెంటనే శ్రీశైలం మల్లికార్జున స్వామిని కొత్త దంపతులతో కలిసి నాగార్జున దర్శించుకున్నారు. అయితే శ్రీశైలం వెళ్ళిన సమయంలో నాగార్జున, శోభిత ధూళిపాళ్ల,నాగచైతన్యకు సంబంధించిన ఫోటోలు మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.అయితే వీళ్ళు ముగ్గురు అక్కడికి వెళ్లిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది.ఇక ఆ వీడియోలో ఏముందయ్యా అంటే..గుడిలో హారతి తీసుకునే సమయంలో ఓవైపు నాగచైతన్య మరోవైపు నాగార్జున మధ్యలో శోభిత ధూళిపాళ్లలు ఉన్నారు. ఇక శోభిత ధూళిపాళ్ల దేవుడి బొట్టు పెట్టుకునే సమయంలో ఆమె జుట్టు పదేపదే ముందుకు వస్తోంది.అయితే అప్పుడే నాగార్జున శోభిత జుట్టును చేయితో పట్టుకొని మెడ వైపు లాగాడు.
అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో చాలామంది నాగార్జున పై ట్రోల్ చేస్తున్నారు.నువ్వు శోభితకు మామయ్యవా.. లేక భర్తవా.. భర్త చేయాల్సిన పని నువ్వెందుకు చేస్తున్నావ్.. అసలు ఒక మామయ్య ఒక కోడలు దగ్గర ప్రవర్తించాల్సిన తీరేనా ఇది.. అంటూ నాగార్జున పై ట్రోల్స్ చేస్తున్నారు. కానీ పెద్ద పెద్ద వారి ఇళ్ళలో ఇది కామనే.చాలామంది కోడళ్లను,మరదళ్లని కూడా హగ్ చేసుకుంటూ ఉంటారు.సెలబ్రిటీల విషయంలో ఇవన్నీ పట్టించుకోరు. అలా అని నాగార్జున చేసింది ఏమీ పెద్ద తప్పు కాదు. జుట్టు ముందుకు వస్తూ ఉంటే అలా పట్టుకున్నాడు అంతే.అందులో ఆయన చేసిన తప్పేమీ లేదు.అసలు సెలబ్రిటీలు ఈ విషయాన్ని పట్టించుకోరు.కానీ సోషల్ మీడియా జనాలు మాత్రమే వీటిని ట్రోల్స్ చేస్తారు. కానీ ఈ ట్రోల్స్ పై అక్కినేని ఫ్యాన్స్ కూడా తిప్పి కొడుతున్నారు