బాలయ్య పెళ్లి.. గందరగోళంలో ఎన్టీఆర్..ఆయన ఇష్టం లేకుండానే ?
అయితే.. తాజాగా బాలయ్య పెళ్లి గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. 1982 డిసెంబర్ 8న తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మధ్యాహ్నం 12:41 గంటలకు వివాహం చేసుకున్నారు బాలకృష్ణ. సాధారణంగా ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయం ప్రకారం రాత్రి సమయంలో వివాహాలు జరుగుతూ ఉంటాయి. కానీ బాలయ్య బాబు వివాహం మధ్యాహ్నం జరిగింది. కర్ణాటక కళ్యాణ మండపంలో వివాహం జరగింది.
మరో విశేషం కాకినాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త దేవరపల్లి సూర్యరావు ప్రమీల రాణి గార్ల రెండవ కూతురు వసుంధర దేవితో బాలయ్య పెళ్లి జరిగింది. బాలకృష్ణ వివాహం కార్డు కూడా ఈ మధ్య వైరల్ అయింది. ఇదిలా ఉండగా బాలకృష్ణ వివాహ సమయంలో సీనియర్ ఎన్టీఆర్ తెగ కంగారు పడిపోయారట. దానికి గల కారణం ఆయన రాజకీయంగా బిజీగా ఉండడం. ఎన్టీఆర్ ఇదే సంవత్సరంలో టిడిపిని స్థాపించారు. 1983 జనవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది.
డిసెంబర్ చివరలో బాలయ్య బాబు వివాహం. ప్రచారంలో బిజీగా ఉన్న సమయంలో ఓవైపు పెళ్లి పనులు జరిగాయట. మరోవైపు రాజకీయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లో చాలా బిజీగా ఉన్నారట ఎన్టీఆర్. దానివల్ల బాలకృష్ణ వివాహాన్ని ఎన్టీఆర్ ఆస్వాదించలేకపోయారట. ఓ రకంగా తన కుమారుడు వివాహానికి కేవలం గెస్ట్ పాత్రను మాత్రమే పోషించారని ఇండస్ట్రీ వర్గాల్లో ఎప్పటినుంచో టాప్ వినిపిస్తూ ఉంటుంది.