పుష్ప 2: అల్లు అర్జున్ కి రెండో జాతీయ అవార్డు.. బాలీవుడ్ హీరోయిన్ హాట్ కామెంట్స్..!

Divya
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప 2 మూవీ జాతీయస్థాయిలో భారీ పాపులారిటీ అందుకుంది.. విడుదలైన మొదటి రోజు నుంచి ఈరోజు వరకు భారీ కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ గా దూసుకుపోతోంది పుష్ప 2. అన్ని ఇండస్ట్రీలలో పలు రకాల రికార్డులను కూడా తిరగరాస్తూ కలెక్షన్స్ ని రాబడుతోంది. పుష్ప 2 చిత్రం పైన బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ప్రశంసిస్తూ ఉన్నారు కొందరు మాత్రం పుష్ప 2 సినిమా పైన కడుపు మంటతో నిప్పులు చెలరేగుతూ ఉన్నారు.

పుష్ప 2బాలీవుడ్ నుంచి భారీ మద్దతు లభించింది. కొంతమంది సినీ ఇండస్ట్రీకి చెందినవారు పుష్ప 2 సినిమా సాధించిన విజయానికి స్టన్ అయిపోయారు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన బాలీవుడ్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ కి పరిమితమైన ముద్దుగుమ్మ ఊర్వశి  రౌతేలా పుష్ప -2 సినిమా పైన స్పందిస్తు తన అభిప్రాయాన్ని తెలిపింది. సినిమా చూసిన తర్వాత సోషల్ మీడియాలో ఇలా తెలియజేస్తూ సినిమాలను ప్రతి ఒక్కరినట్టిన సూపర్ గా ఉందంటూ తెలిపింది.

సినిమాలోని జాతర సన్నివేశం మరింత హైలెట్ అయ్యిందని అల్లు అర్జున్ తన నటన కొత్త ఎత్తులకు ఎక్కినట్టుగా అనిపిస్తోందని తెలిపింది. అందులో అద్భుతమైన నటనకు రెండవసారి కూడా జాతీయ అవార్డు వస్తుందని నమ్మకం ఉన్నదని తెలిపింది తప్పకుండా ఈ సినిమాతో జాతీయస్థాయిలో మరొకసారి సత్తా చాటుతారు అంటూ చిత్ర బృందం అందరికీ కూడా అభినందనలు తెలియజేసింది ఊర్వశి రౌతేలా. ఈ విషయం పైన అల్లు అర్జున్ యాంటీ అభిమానులు విమర్శిస్తూ ఉన్నప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా తమ హీరోలకు మరొకసారి జాతీయ అవార్డు రావడం ఖాయం అంటూ తెలిపారు. గతంలో పుష్ప చిత్రానికి అల్లు అర్జున్ కి జాతీయ అవార్డు కూడా దక్కింది.. పుష్ప చిత్రంతో పోలిస్తే సీక్వెల్ కి మూడు రెట్లు అధికంగానే అల్లు అర్జున్ కష్టపడ్డారని చెప్పవచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: