హాలీవుడ్ హీరోయిన్ తో ధనుష్ రొమాన్స్.. కాంబో అదుర్స్.?

Pandrala Sravanthi
 కోలీవుడ్ నటుడు ధనుష్ చూడ్డానికి అసలు హీరో రూపంలోనే ఉండరు. బక్కపలచని శరీరంతో అసలు హీరోకి ఏ మూలనా కూడా సెట్ అవ్వరు అనే కటౌట్ తో ఉంటారు. కానీ అలాంటి ధనుష్ ని చూస్తే స్టార్ హీరోయిన్స్ అయినా సరే ఫిదా కావాల్సిందే.. ఎందుకంటే అనే యాక్టింగ్ అలా ఉంటుంది.సింపుల్ గా ఉండే ధనుష్ నేచురల్ యాక్టింగ్ తో ఎంతోమందిని మెప్పించారు. ఇప్పటివరకు ఆయన తీసిన చాలా సినిమాలు నటన,కథ వంటి అంశాలతోనే హిట్ అయ్యాయి. హీరో అంటే భారీ కటౌట్ ఉండడమే కాదు నటనతో ఆకట్టుకోవాలి అని ధనుష్ ని చూస్తేనే అర్థం అవుతుంది.అయితే అలాంటి ధనుష్ గత కొద్ది రోజుల నుండి వివాదాల పాలవుతున్నారు. 

ఈ విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమా చేస్తున్న ధనుష్ త్వరలోనే ఇడ్లీ కడాయి మూవీ తో పాటు మరో కొత్త సినిమా కూడా చేయబోతున్నారట. అయితే ఆ సినిమాలో హీరోయిన్ గా హాలీవుడ్ బ్యూటీ నటిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.ఇప్పటికే హాలీవుడ్ బ్యూటీ తో చర్చలు కూడా జరిపినట్టు సమాచారం  ఇక ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే.. సిడ్నీ స్వీని..సోనీ పిక్చర్స్ నిర్మాణంలో ధనుష్ సిడ్ని స్విని కాంబోలో సినిమా రాబోతుందట. ఈ సినిమాకి స్ట్రీట్ ఫైటర్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

దీంతో ఈ మ్యాటర్ నెట్టింట వైరల్ అవ్వడంతో చాలా మంది నెటిజన్స్ ధనుష్ రేంజ్ అంటే ఇది..హాలీవుడ్ హీరోయిన్ తో రొమాన్స్ చేయబోతున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక సిడ్ని స్వీని ఎలాంటి రొమాంటిక్ పాత్రలోనైనా, బోల్డ్ పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటిస్తుంది. అయితే అలాంటి ఈ బ్యూటీతో ధనుష్ సినిమా చేస్తున్నారని తెలిసి ఆయన ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. మరి వీరి కాంబోలో సినిమా రావడంపై వస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉందో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: