రాజమౌళి మొదటి సినిమాకు పాన్ ఇండియా హీరో ప్రభాస్ కి ఉన్న లింక్ ఇదే ..!
ఈ సినిమాతో తెలుగులోనే తిరుగులేని దర్శకుడుగా ఇప్పటివరకు ఒక సినిమా కూడా ప్లాప్ ఎరుగని దర్శకుడుగా రాజమౌళి కొనసాగుతున్నారు .. వైజయంతి మూవీస్ బ్యానర్ లో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా వచ్చింది .. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఎవరి ఊహించని వార్తను సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు .. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. మహేష్ బాబు తో రాజకుమారుడు , బన్నీతో గంగోత్రి , రామ్ చరణ్ తో చిరుత ఇలా ఈ హీరోల తొలి సినిమా మా బ్యానర్ లోనే వచ్చాయి .. కానీ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ రెండో సినిమా.
నిజానికి ఈ సినిమా తొలత పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో చేయాలని అనుకున్నారు .. కానీ అదే సమయంలో హరికృష్ణ ఫోన్ చేయడం తో మొత్తం ప్లాన్ ఒకసారి గా మారిపోయింది. స్టూడెంట్ నెంబర్ వన్ తారక్ తో చేయటం ఊహించని విధంగా జరిగిందని చెప్పుకొచ్చాడు అశ్వినీ దత్ .. ఇక నిజానికి ప్రభాస్ మొదటి సినిమా మా బ్యానర్ లోనే రావాలి కానీ అనుకోకుండా అది మిస్ అయిందని ఆయన చెప్పుకొచ్చాడు .. ఈ సంవత్సరం అశ్వినీదత్ నిర్మాతగా నాగ్ అశ్వన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్ లో అదిరిపోయే హిట్ అందుకుని 1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి అదిరిపోయే రికార్డులు క్రియేట్ చేశాడు. ఈ సినిమాకి సీక్వల్ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది .