తెలుగు సినిమా పరిశ్రమ లో ఇప్పటి వరకు ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి . ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటులలో రాజ్ తరుణ్ ఒకరు . ఈయన ఉయ్యాల జంపాల అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు . ఈయన మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని అందుకున్నాడు . దానితో ఆ తర్వాత నుండి ఈయన కు తెలుగు లో మంచి సినిమా అవకాశాలు రావ డం మొదలు అయింది.
అందులో భాగంగా ఈయన కెరియర్ ప్రారంభించిన కొత్తలోనే సినిమా చూపిస్త మామ , కుమారి 21 ఎఫ్ అనే సినిమాలతో కూడా మంచి విజయాలను అందుకున్నాడు. ఇలా కెరియర్ ప్రారంభం లోనే ఈయన కు మంచి విజయాలు రావడంతో చాలా తక్కువ కాలంలోనే ఈ నటుడిగా తెలుగులో మంచి గుర్తింపు లభించింది. కెరియర్ ప్రారంభంలో వరుస పెట్టి విజయాలను అందుకున్న ఈయన ఆ తర్వాత మాత్రం ఆ స్థాయి విజయాలను అందుకోలేకపోయాడు. ప్రస్తుతం ఈయనకు వరుస పేట్టి అపజయాలు వస్తున్నాయి. ఇకపోతే కెరియర్ చాలా లో లో కొనసాగుతున్న సమయం లోనే ఈయనపై లావణ్య అనే మహిళ తనను పెళ్లి చేసుకుంటాను అని రాజ్ తరుణ్ నమ్మించి మోసం చేశాడు అని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక ఆ తర్వాత రాజ్ తరుణ్ కూడా ఆమె కూడా నన్ను మోసం చేసింది అంటూ రిటన్ కౌంటర్ ఇచ్చాడు.
ఇక వీరిద్దరికీ సంబంధించిన వ్యవహారం కొన్ని రోజుల పాటు తెలుగు సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. కొన్ని రోజుల పాటు వీరిద్దరూ ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటూ వెళ్లారు. ఇక ప్రస్తుతం మాత్రం వీరి వ్యవహారం కాస్త చల్లబడింది.