మురళీ శర్మ భార్య ఎవరో తెలుసా.. టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో విలన్ పాత్రలో నటించింది..?

Pulgam Srinivas
తెలుగులో ప్రస్తుతం ఫుల్ బిజీయేస్ట్ నటుడిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో మురళీ శర్మ ఒకరు . ఈయన కొన్ని సంవత్సరాల క్రితం మహేష్ బాబు హీరో గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన అతిధి సినిమాలో విలన్ పాత్రలో నటించాడు . ఈ మూవీ పెద్ద స్థాయి విజయాన్ని సాధించకపోయిన ఇందులో మురళీ శర్మ పాత్రకు మాత్రం అద్భుతమైన గుర్తింపు వచ్చింది . దానితో ఈ సినిమా తర్వాత నుండి ఈయనకు తెలుగులో వరుస పెట్టి అవకాశాలు రావడం మొదలయింది. అలాగే ఈయన నటించిన సినిమా విజయం సాధించిన , సాధించకపోయిన ఆయన తన నటనతో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు.

దానితో ఆయనకు అవకాశాలు మరింతగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ఈయన అనేక సినిమాలలో నటిస్తూ అద్భుతమైన అత్యంత బిజీ నటుడిగా తెలుగులో కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే మురళి శర్మ భార్య ఎవరో తెలుసా ..? ఆమె కూడా ఒక నటి. ఇప్పటికే ఆమె ఒక స్టార్ హీరో సినిమాలో ప్రతినాయక పాత్రలో కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. మరి ఆమె ఎవరనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు ... అశ్వినీ కల్‌శేఖర్. అశ్వినీ కల్‌శేఖర్ , అల్లు అర్జున్ హీరోగా తమన్నా హీరోయిన్గా వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన బద్రీనాథ్ సినిమాలో విలన్ పాత్రలో నటించిన సర్కార్ కి భార్య పాత్రలో నటించింది.
 

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని అందుకోకపోయినా ఈ మూవీ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన అశ్వినీ కల్‌శేఖర్ మాత్రం తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తెలుగులో బద్రీనాథ్ సినిమాతో పాటు అశ్వినీ కల్‌శేఖర్ , రవితేజ హీరో గా రూపొందిన నిప్పు మూవీ లో విలన్ కి భార్య పాత్రలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: