పుష్ప 2: చిత్రంపై కొత్త వివాదం..కలెక్షన్స్ కు గండిపడేనా..?
ఒక ఉత్తర భారత దేశంలోనే మంచి ఆదాయం కనిపిస్తోందట..అయితే తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఆశించిన దానికంటే కొంత తక్కువ వచ్చింది.. కానీ బ్రేక్ ఈవెన్ మొత్తం మీద అందుకుంది పుష్ప 2 సినిమా.. సుమారుగా రూ .922కోట్లకు పైగా దాటింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న కొత్త వివాదం ఏమిటంటే.. కర్నిసేన ఏదైతే క్షత్రియ సంస్థ కింద చెప్పేటువంటి సమస్థ మహారాష్ట్రలో ఉన్నటువంటి సమస్థ ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ కి సంబంధించి పుష్పకి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అందులో విలన్ గా ఫహాద్ ఫాజిల్ కు ఉన్న వ్యక్తి పేరు శకావత్ అని పెట్టారు.. క్షత్రియులను అవమానిస్తున్నారనే విధంగా , క్షత్రియ వర్గాలను అవమానిస్తున్నారని.. తక్షణం పుష్ప సినిమాని ఆపేయాలంటూ కొత్త డిమాండ్ చేస్తున్నారట.. అయితే అది పబ్లిక్ డిమాండ్ అయినప్పటికీ ఈ చిత్రాన్ని ఆపడానికి కాదని పలువురు సినీ విశ్లేషకుల సైతం తెలియజేస్తున్నారు.. అయితే ఇలాంటి సమయాలలో పుష్ప 2 చిత్రం పైన ఇలాంటి వాదనలు వినిపిస్తూ ఉన్న తరుణంలో ఈ సినిమా కలెక్షన్స్ పైన ఇబ్బందులు తలెత్తుతాయనే విధంగా పలువురు నేటిజన్స్ తెలియజేస్తున్నప్పటికీ.. అయితే ఇలాంటివన్నీ కూడా అన్ని సినిమాలకి జరుగుతూనే ఉంటాయని కానీ పుష్ప 2 చిత్రానికి అంతకంతకు కలెక్షన్స్ పెరుగుతూనే ఉందనే విధంగా అభిమానులు భావిస్తున్నారు.