వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. టాలీవుడ్ తో పాటు దగ్గుబాటి ఫ్యామిలీని గెలికిన శ్రీ రెడ్డి ?

Veldandi Saikiran
టాలీవుడ్ ఇండస్ట్రీలో... వివాదాలు చాలా కామన్. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది హీరోల మధ్య గొడవలు జరిగిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అలాగే మెగా, నందమూరి, మంచు, అక్కినేని ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది సినిమాల కుటుంబాల మధ్య కూడా రచ్చ జరిగింది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోని వివాదం శ్రీ రెడ్డి. టాలీవుడ్ నటి శ్రీ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
 అప్పట్లో కాస్టింగ్ కౌచ్ గురించి టాలీవుడ్ ఇండస్ట్రీ ని షేక్ చేసేలా రచ్చ చేసింది టాలీవుడ్ శ్రీ రెడ్డి. అర్థ నగ్నం గా... టాలీవుడ్ ఇండస్ట్రీ కి సంబంధించిన బిల్డింగ్ ముందు... నిరసన కూడా తెలిపింది. అవకాశాల కోసం... తనను వాడుకున్నారని... నాన రచ్చ చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది దర్శకులు అలాగే నిర్మాతలపై సంచలన ఆరోపణలు చేసింది. ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయిల పై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని... మండిపడింది టాలీవుడ్ శ్రీ రెడ్డి.
 అలాగే దగ్గుబాటి కుటుంబం గురించి... ఆరోపణలు చేయడం జరిగింది.  దగ్గుబాటి అభిరామ్ తో తనకు సంబంధం ఉందని కూడా బాంబు పేల్చింది శ్రీరెడ్డి. తనను పెళ్లి చేసుకోవాలని కూడా... అప్పట్లో పోస్టులు పెట్టి మరి రచ్చ చేసింది. అభిరామ్ తో ఉన్న ప్రైవేట్ ఫోటోలను... బయటకు వదిలి ఆ కుటుంబాన్ని బెదిరించింది నటి శ్రీరెడ్డి. దీంతో అప్పటినుంచి నటి శ్రీరెడ్డి పాపులర్ అయిపోయింది.
 అయితే ఆ ఎపిసోడ్ తర్వాత వైసిపి పార్టీ కార్యకర్తగా మారిపోయింది శ్రీ రెడ్డి. నిత్యం వైయస్ జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకుంటూ... సోషల్ మీడియాలో రచ్చ చేసేది. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలను... పైకి లేపే ప్రయత్నం చేసింది శ్రీరెడ్డి. ఇక ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో... కాస్త చల్లబడింది. దీంతో ఈ మధ్యకాలంలో నటి శ్రీరెడ్డి పేరు పెద్దగా వినిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: