కమెడియన్ సత్య.. కాస్లీ సత్య అయిపోయాడు.. రెమ్యూనరేషన్ ఎంతంటే?
అయితే, అందులో కూడా స్టార్ హోదా అతి కొద్దిమందినే వస్తుంది. ప్రస్తుత కమెడియన్లలో మాత్రం ఆ హోదా కమెడియన్ సత్యకే దక్కింది అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల ‘మత్తువదలరా 2’ అనే సినిమాతో మరోమారు సత్య అందరి దృష్టినీ తన వైపు తిప్పుకొన్నాడు. ఈ సినిమాకి ముందు వరకూ సత్య పారితోషికం రోజుకు రూ.లక్ష నుండి లక్షన్నర ఉండేది. ‘మత్తు వదలరా’ తరవాత మాత్రం తన పారితోషికం ఏకంగా రూ.3.5 లక్షలు పెరిగిపోయింది. అంత ఇస్తానన్నా ఇప్పుడు సత్య అందుబాటులో లేడని చెప్పుకోవాలి. అంత బిజీ అయిపోయాడు మరి!
ఎంత బిజీ అయిపోయాడు అంటే... సత్య హీరోగా కొన్ని సినిమాలు ఓకే అయ్యి, ఇప్పుడు ఆగిపోయాయి. కారణం.. సత్య ఊపిరి సలపనంత బిజీగా మారిపోవడమే దానికి కారణం. ఎంతలా అంటే రోజుకి మూడు ఫిఫ్టుల్లో పని చేయాల్సి వస్తోందట. దాంతోనే సత్య పట్టిందల్లా బంగారం అవుతోందట. కొంతమంది నిర్మాతలు అయితే సత్య నటిస్తే చాలు... ఆయన అడిగినంత ఇవ్వడానికి రెడీగా ఉన్నాం అని చెబుతున్నారని వినికిడి. ఆఖరికి సత్య సగటున ఒక హీరోకంటే కూడా ఎక్కువగా సంపాదిస్తున్నాడు అని టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి. అది నిజమే అయ్యి ఉంటుంది మరి... ఎందుకంటే హీరో ఓ సినిమా ఒప్పుకొంటే, దానికే కమిట్ అవ్వాలి. హీరోగా చేశానన్న తృప్తి మినహాయిస్తే డబ్బులూ పెద్దగా సంపాధించిందేం ఉండదు. అదే కమెడియన్ గా చేస్తే వీలైనన్ని ఎక్కువ సినిమాలు కవర్ చేయొచ్చు, పారితోషికమూ ఎక్కువ అందుకోవొచ్చు. ఈ క్రమంలోనే సత్య నేడు కోట్లలో సంపాదిస్తున్నాడు అని వినికిడి!