"ఆ కటౌట్ చూస్తేనే కొరుక్కుని తినేయాలి అనిపిస్తుంది".. తెలుగులో శోభిత ధూళిపాళ్ల ఫేవరేట్ హీరో ఆయనే..!

Thota Jaya Madhuri
శోభిత ధూళిపాళ్ల నిన్నటి వరకు ఒక హీరోయిన్ .. మహా అయితే స్టార్ హీరోయిన్ ..ఇంకా ముందుకెళ్తే హాట్ హాట్ హీరోయిన్.. అంతే అలానే చెప్పుకునే వాళ్ళు జనాలు . అయితే ఇప్పుడు మాత్రం ఫుల్ రూట్ మారిపోతుంది .ఎంతలా అంటే శోభిత ధూళిపాళ్ల పేరు చెప్పితే హీరోయిన్ అని కాకుండా.. అక్కినేని ఇంటి కోడలు అని టాలీవుడ్ ఇండస్ట్రీని శాసించే వన్ ఆఫ్ ది  హీరో ఇంటికి కోడలుగా అడుగుపెట్టడం ఆమె అదృష్టమని చాలా మంది పొగిడేస్తున్నారు .



స్పెషల్ గౌరవం కూడా ఇస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా శోభిత ధూళిపాళ్ళను ఒక హీరోయిన్ గా కాకుండా నాగచైతన్య భార్యగా అక్కినేని ఇంటికి కోడలుగా చూపిస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా హాట్ టాపిక్ ట్రెండ్ అవుతూ వస్తుంది. రీసెంట్గా శోభిత ధూళిపాళ్ల తన పెళ్లికి రెడీ అవుతున్న ఒక వీడియోని షేర్ చేసింది . చాలా అందంగా ముస్తాబైన శోభిత ధూళిపాళ్ల బన్నీ నటించిన బ్లాక్ బస్టర్  సాంగ్ కి స్టెప్స్ కూడా వేసింది . దీంతో బన్నీ ఫ్యాన్స్ ఈ వీడియోను బాగా ట్రెండ్ చేస్తున్నారు . శోభిత ధూళిపాళ్ల ఫేవరెట్ హీరో బన్నీ అయ్యి ఉండొచ్చు అని అందుకే తన పెళ్లిలో సాంగ్ ప్లే చేయించుకొని మరి డాన్స్ చేస్తుంది అని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. ఈ వీడియో హైలైట్ గా మారింది.


ప్రజెంట్ ఈ వీడియోని బన్ని  అభిమానులు ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు . అయినా బన్ని కటౌట్ అలాంటిది. ఆ కటౌట్ చూస్తేనే కొరుక్కుని తినేయాలి అనిపిస్తూ ఉంటుంది అంటారు జనాలు. కాగా శోభిత - నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.  సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య కొన్ని కారణాల చేత ఆమెకు విడాకులు ఇచ్చేసి మరి శోభిత ధూళిపాళ్లని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . అయితే సమంత ఫ్యాన్స్ కి మాత్రమే ఈ విషయం మింగుడు  కూడా పడడం లేదు.  ప్రేమ అనేది లైఫ్ లో ఒక సారి పుడుతుంది అని ఇన్నిసార్లు పుడితే దాన్ని ప్రేమ అనరని దానికి వేరే అర్థం ఉంది అని ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: