పుష్ప2 సినిమా సూపర్ డూపర్ హిట్.. కానీ రష్మికకు ఆఫర్స్ నిల్.. కారణం ఏంటంటే..?

Thota Jaya Madhuri
రష్మిక మందన్నా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ . ఈ మ్యాటర్ ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి ముఖ్యంగా నేషనల్ క్రష్ గా టాయ్గ్ తగిలించుకొని టాలీవుడ్ - బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలలో రష్మిక మందన్నా ఏ రేంజ్ లో ఆఫర్స్ దక్కించుకుందో మనకు తెలిసిందే.  తాజాగా ఆమె  నటించిన సినిమా పుష్ప2 సినిమా ఎలా బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందో మనం చూస్తున్నాం.  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు రోజుల్లో 829 కోట్లు క్రాస్ చేసి సూపర్ డూపర్ హిట్ మూవీ కావడమే కాకుండా ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిస్టరీనే తిరగరాసింది. అంతేకాదు ఈ సినిమా 2000 కోట్లు దాటేస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్.


పుష్ప2 సినిమాలో  నటించినందుకు అల్లు అర్జున్ కు ఎలాంటి మార్కులు దక్కాయో అదే విధంగా రష్మిక కూడా మంచి మార్కులు దక్కించుకున్నింది.  రష్మిక మందన్నా నిజంగానే  నటన పరంగా హిట్ కొట్టిన మొదటి మూవీ ఇదే అని చెప్పాలి . అయితే పుష్ప2 సినిమా హిట్ అయిన రష్మిక మందన్నా ఖాతాలోకి కొత్త ఆఫర్స్ రావడం లేదు . దానికి కారణం ఆమె ఆల్రెడీ కమిటేడ్ అంటూ పుష్ప2  ప్రమోషన్స్ లో చెప్పేసింది . చెన్నై ఈవెంట్లో పాల్గొన్న రష్మిక మందన్నా పరోక్షకంగానే తను  విజయ్ దేవరకొండ తో రిలేషన్షిప్ లో ఉన్నాను అంటూ కన్ఫామ్ చేసింది .


నిన్న కాకమొన్న రిలీజ్ అయిన గర్ల్ ఫ్రెండ్ టీజర్ లోను విజయ్ దేవరకొండ వాయిస్ హైలెట్గా మారింది . దీంతో విజయ్ దేవరకొండ పరోక్షకంగా తన గర్ల్ ఫ్రెండ్ రష్మిక మందనానే  అంటూ కన్ఫామ్ చేసేసినట్లయింది. ఇలాంటి మూమెంట్లోనే రష్మిక మందన్నా ఏ మూమెంట్లో ఆయన ను పెళ్లి చేసుకోవచ్చని అలాంటప్పుడు ఆమెకు సినిమా అవకాశాలు హాట్ రోల్స్ ఇవ్వడం న్యాయం కాదు అని.. మేకర్స్ రష్మిక మందన్నాని కాకుండా వేరే హీరోయిన్స్ ని చూస్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట . మరి ముఖ్యంగా ప్రశాంత్ నీల్-  ఎన్టీఆర్  కాంబోలో తెరకెక్కే మూవీలో సైతం రష్మిక మందన్నా సెలెక్ట్ అయినట్లే అయి రిజెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో రష్మిక మందన్నాకి పుష్ప 2 సినిమా హిట్ అయిన పెద్దగా ఉపయోగ లేకపోయింది అంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: