అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన చిత్రం పుష్ప 2 ది రూల్. 2021లో విడుదలైన పుష్ప: ది రైజ్ కు సీక్వెల్‌గా ఇది రూపుదిద్దుకుంది. రష్మిక కథానాయిక. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై దీనిని నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న ఇది విడుదలైంది. అల్లు అర్జున్ యాక్టింగ్ అద్భుతంగా ఉందని సినీ ప్రియులు, ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్‌లో ఆయన ప్రదర్శన అదరహో అంటున్నారు.ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రికార్డుల వేటకు, వసూళ్ల ఊచకోతకు బాక్సాఫీస్ దగ్గర ఎదురునేదే లేకుండా పోయింది. 'పుష్ప 2: ది రూల్' చిత్రానికి ప్రేక్షకులు జేజేలు కొట్టారు. థియేటర్ల దగ్గర బ్రహ్మరథం పడుతున్నారు. దాంతో రోజుకు ఒక రికార్డు ఆ సినిమా వశం అవుతోంది. తాజాగా మరో రికార్డు 'పుష్ప 2' ఖాతాలో చేరింది. అది ఏమిటంటే అల్లు అర్జున్ హీరోగా చేసిన ఈ సెన్సేషనల్ సీక్వెల్ తో మొదటి రోజే బిగ్గెస్ట్ రికార్డు, భారీ మార్జిన్‌తో క్రాస్ చేసి పారేసాడు.
ఇక్కడి నుంచి మొదలైన రికార్డ్స్ ఇపుడు నాన్ అల్లు అర్జున్ రికార్డులు అనే మాటకి వచ్చేసాయి. ఇన్ని రోజులు ఉన్న నాన్ రాజమౌళి అనే ప్రెస్టీజియస్ మాట అల్లు అర్జున్‌కి దాసోహం అయ్యింది. లేటెస్ట్ గా అయితే ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత వేగంగా 1000 కోట్ల మార్క్‌ని అందుకున్న పుష్ప 2తో తమ అభిమాన హీరోని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇండియన్ సినిమా బాక్సాఫీస్ కి గాడ్జిల్లాగా ప్రకటించుకున్నారు.మరి గాడ్జిల్లా ఎంత పవర్ఫుల్ అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ట్రెండ్‌లో కేవలం 6 రోజుల్లోనే ఓ సినిమా రూ.1002 కోట్లు గ్రాస్ కొట్టడం అనేది అనితర సాధ్యం. అందుకే బాక్సాఫీస్ గాడ్జిల్లాగా అల్లు అర్జున్‌ని ఇపుడు అభిమానులతో పాటు చిత్ర యూనిట్ కూడా ఒప్పుకుంటున్నారు. ఇలా ఐకాన్ స్టార్ ఇపుడు ఇండియన్ సినిమా దగ్గర చరిత్ర సృష్టించి నాన్ అల్లు అర్జున్ అనే మాటని సొంతం చేసుకున్నాడు.ఇదిలావుండగా తొలి రోజు అత్యధిక వసూళ్లు రూ. 294 కోట్లు సాధించిన ఇండియన్ ఫిల్మ్‌గానూ 'పుష్ప 2' రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం దీని పై చిత్ర యూనిట్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.ఈవిధంగా దర్శకుడు సుకుమార్ కామర్షియల్ సినిమాలకు కొత్త అర్ధం చెప్పారని పేర్కొన్నారు.