HBD: రజినీకాంత్ అసలు పేరు ఏంటో తెలుసా..?
రజనీకాంత్ అసలు పేరు "శివాజీ రావు గైక్వాడ్".. ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత తన పేరును రజినీకాంత్ గా మార్చుకున్నారు. రజినీకాంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే తమిళనాడులో స్టార్ హీరోగా పేరు సంపాదించిన రజనీకాంత్ తెలుగులో కూడా అంతే స్థాయిలో క్రేజ్ అందుకున్నారు. మొదటిసారి తన గురువు కే.బాలచంద్ర డైరెక్షన్లో అపూర్వరాగంగల్ అనే చిత్రం ద్వారా మొదటిసారి ఎంట్రీ ఇచ్చారు ఈ చిత్రాన్ని అంతులేని కథ గా తెలుగులోకి అనువదించడం జరిగిందట.
రజనీకాంత్ కెరియర్ లోనే టర్నింగ్ పాయింట్ గా నిలిచిన చిత్రం భాష.. ఇందులో రజనీకాంత్ నటనకు ప్రశంసలు కూడా అందుకున్నారు. ఆ తర్వాత పెద్ద రాయుడు, ముత్తు, అరుణాచలం, చంద్రముఖి నరసింహ, శివాజీ ,రోబో, పేట, జైలర్, తదితర చిత్రాలలో నటించి భారీ క్రేజ్ అందుకున్నారు. ఇప్పటికీ 20 ఏళ్ల కుర్రాడిలా నటిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు రజనీకాంత్. రజినీకాంత్ తెలుగు తమిళంలోనే కాకుండా హిందీ కన్నడ వంటి భాషలలో కూడా సినిమాలు చేస్తూ జాతీయస్థాయిలో పేరు సంపాదించారు.
1981లో లతను వివాహం చేసుకున్నారు రజినీకాంత్.. వీరికి ఐశ్వర్య సౌందర్య అని ఇద్దరు కూతుర్లు జన్మించారు.. 2000 సంవత్సరంలో పద్మభూషణ్ ,2016 పద్మ విభూషణ్ వంటివి అందుకున్నారు.. 2019లో దాదాసాహె పాల్కే పురస్కారాలను సైతం అందుకోవడం జరిగింది రజనీకాంత్. ప్రస్తుతం రజనీకాంత్ కూలి సినిమాల నటిస్తూ ఉన్నారు. మరి ఈ రోజున రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా చిత్రాల నుంచి అప్డేట్లు వస్తాయని అభిమానులు ఎదురుచూస్తున్నారు.