చాలామంది హీరోయిన్లకి కొంతమంది హీరోలు అంటే ఒక రకమైన క్రష్ ఉంటుంది. అయితే వారికి పెళ్లయి పిల్లలున్నా సరే ఒక్కసారైనా డేటింగ్ చేస్తే బాగుండు అనే అభిప్రాయం కొంతమందిలో ఉంటుంది. ఇక మరికొంతమంది హీరోయిన్లకు ఒక్కసారైనా వారితో కలిసి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తే బాగుండు అనే కల ఉంటుంది.అయితే తాజాగా ఓ హీరోయిన్ కూడా పవన్ కళ్యాణ్ పై మనసు పడింది.ఆ హీరోయిన్ పవన్ కళ్యాణ్ తో ఒక్కసారైనా ఆ పని చేయాలనేది తన డ్రీమ్ అంటూ చెప్పింది. మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ పై అంత ఇష్టం పెంచుకున్న ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే ఐశ్వర్య మీనన్.. సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మలయాళ, కన్నడ,తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా చేసింది. అలా తెలుగులో ఈమె మొదటి సినిమా లవ్ ఫెయిల్యూర్.. ఆ తర్వాత రవితేజ ఖిలాడి మూవీ లో కూడా నటించింది.
ఇక ఈమెకు గుర్తింపు తీసుకువచ్చిన సినిమా అంటే రీసెంట్ గా కార్తికేయ నటించిన భజే వాయువేగం సినిమా అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ నటనకి మంచి మార్కులు పడ్డాయి.అలాగే నిఖిల్ స్పై మూవీ లో కూడా ఐశ్వర్య మీనన్ నటించింది. అయితే ఐశ్వర్య మీనన్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.ఇక అసలు విషయంలోకి వెళ్తే..పవన్ కళ్యాణ్ తో ఐశ్వర్య మీనన్ రొమాన్స్ చేస్తున్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అయితే ఈ పిక్ చూసి ఎంతగానో మురిసిపోయిన ఐశ్వర్య మీనన్ ఆ పిక్చర్ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ ఈ పిక్చర్ ని ఎవరు కలిపారో కానీ వారికి థాంక్స్ చెబుతున్నాను.
అయితే ఈ పిక్ లో ఉన్నట్టే ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ గారితో నటించే అవకాశం ఆన్ స్క్రీన్ మీద రొమాన్స్ చేసే అవకాశం వస్తే బాగుండు.నేను ఎప్పటినుండో పవన్ కళ్యాణ్ తో ఒక్క అవకాశం వచ్చినా చాలు అనుకుంటున్నాను. ఆయనకి నేను వీరాభిమానిని.. ముఖ్యంగా ఈయన నటించిన ఖుషి సినిమాలో ఈయన నటన చూసి ఫిదా అయ్యాను. ఒక్కసారైనా పవన్ సినిమాలో అవకాశం వస్తే బాగుండు అంటూ ఐశ్వర్య మీనన్ తన మనసులో ఉన్న మాట చెప్పుకొచ్చింది. దీంతో పవన్ కళ్యాణ్ మీద క్రష్ పెంచుకున్న హీరోయిన్ల లిస్టులో ఐశ్వర్య మీనన్ కూడా చేరిపోయింది