సైలెంట్ షాక్ ఇచ్చిన కృతి శెట్టి.. దెబ్బకి ఫ్యాన్స్ మైండ్ బ్లాక్..!?

Thota Jaya Madhuri
కృతి శెట్టి ..తెలుగు ఇండస్ట్రీ ద్వారానే బాగా పాపులారిటి సంపాదించుకుంది . కానీ తెలుగులో మాత్రం పెద్దగా అవకాశాలు దక్కించుకోలేక పోతుంది . బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి.. ఆ తర్వాత పలు సినిమాలల్లో నటించి సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుని..ఓ  రేంజ్ లో కెరీ ని మలుచుకునింది.  కానీ ఆ తర్వాత తన బాడీకి సెట్ అవ్వని కంటెంట్ ఉన్న మూవీస్ చూస్ చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి హ్యాట్రిక్ ఫ్లాప్స్ తన ఖాతాలో వేసుకుంది.


ఆ తర్వాత కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.  కోలీవుడ్లో పర్వాలేదు అనే టాక్ దక్కించుకున్న మళ్ళీ తెలుగు సినిమాలో అవకాశాలు వచ్చేసరికి ఆమె నెగిటివ్ రివ్యూలు ఎక్కువగా దక్కించుకుంది. దీనితో కృతి శెట్టికి తెలుగులో అవకాశాలు ఇవ్వడమే మానేశారు డైరెక్టర్లు . అయితే హిట్ ఇచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు సనా ప్రెసెంట్ రాంచరణ్ తో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . ఈ సినిమాలో కృతి శెట్టిని ఒక గెస్ట్ పాత్రలో చేయమంటే అసలు చేయలేను అంటూ రిజెక్ట్ చేసిందట.


ప్రజెంట్ ఈ న్యూస్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది . బుచ్చిబాబు సనా - కృత్తి శెట్టికి బిగ్ హిట్ ఇచ్చాడు. ఉప్పెన సినిమా ద్వారానే ఆమె అవకాశాలు అందుకుంది . అయితే కృతిశెట్టి మాత్రం ఆ కృతజ్ఞతను మరిచి రామ్ చరణ్ సినిమాలో గెస్ట్ పాత్రలో నటించమంటే రిజెక్ట్ చేసిందట . ఒకవేళ గెస్ట్ పాత్రలో నటిస్తే ఎక్కడ మళ్ళీ రాంచరణ్ తో అవకాశాలు రావేమో అన్న భయంతో కృతిశెట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . అయితే రామ్ చరణ్ ఫ్యాన్స్ కి మాత్రం దిమ్మ తిరిగిపోయేలా చేసింది కృతి శెట్టి అంటున్నారు జనాలు. గ్లోబల్ లెవల్ లో క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్ తో సినిమా అంటే ఏ హీరోయిన్ కూడా రిజెక్ట్ చేయదు . కానీ వరుస ఫ్లాప్స్ లో ఉన్న కృతి శెట్టి  రిజెక్ట్ చేయడం అందరికి షాకింగ్గా అనిపించింది. దీనితో సోషల్ మీడియాలో కృతిశెట్టి చేసిన పనికి షాక్ అయిపోతున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: