అల్లు అర్జున్ తో సినిమానా..? భయపడిపోతున్న హీరోయిన్స్.. ఎందుకంటే..?

Thota Jaya Madhuri
అదేంటి వెయ్యికోట్ల క్లబ్ లోకి చేరితే అల్లు అర్జున్ తో సినిమాలో నటించడానికి హీరోయిన్స్ పరుగు పరుగున రావాలి కానీ ఇలా భయపడడం ఎందుకు ..? అని అనుకుంటున్నారా..? అదే న్యూస్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ ఎలా కష్టపడి పుష్ప2 సినిమాను హిట్ చేసుకున్నాడో అందరికీ తెలిసిందే. అసలు ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు వరకు పరిస్ధితి ఎలా ఉందో కూడా మనం చూశాం.


సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హాట్ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది . సినిమా ఆరు రోజుల్లోనే 1002 కోట్లు క్రాస్ చేసి ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా క్రియేట్ చేయని స్పెషల్ రికార్డ్ క్రియేట్ చేసింది . అయితే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో ఒక సినిమాకి కమిట్ అయిన విషయం అందరికీ తెలుసు. ఆ తర్వాత కూడా లిస్టులో బడా బడా డైరెక్టర్ లే ఉన్నారు . అంతా బాగానే ఉన్నా అల్లు అర్జున్ తో నటించడానికి హీరోయిన్స్ మాత్రం ముందడుగు వేయడం లేదు.  దానికి కారణం మెగా హీరోస్ .


ఎస్ ఎవరైతే అల్లు అర్జున్ తో నటిస్తారో ఆ హీరోయిన్స్ మెగా ఫ్యామిలీ లో ఉన్న హీరోలు మొత్తం బ్యాన్ చేసే విధంగా మాట్లాడుకుందట.  ఈ వార్త గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. దీంతో హీరోయిన్స్ అల్లు అర్జున్ తో నటిస్తే ఎక్కడ మెగా ఫ్యామిలీ హీరోస్తో నటించే ఛాన్స్ రాదేమో అన్న భయంతో అల్లు అర్జున్ సినిమా అంటే భయపడిపోతున్నారట . ఒక అల్లు అర్జున్ కోసం కాంప్రమైజ్ అయితే మెగా ఫ్యామిలీ లో ఉండే హీరోస్ అందరితో నటించే ఛాన్స్ మిస్ అయిపోతాము అంటూ ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అసలు అల్లు అర్జున్ ఆఫర్ తీసుకొస్తే డైరెక్టర్ కి కాల్ షీట్స్ లేవంటూ చెప్పేస్తున్నారట . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ వార్త బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: