చైతు నెక్స్ట్ మూవీలో హీరోయిన్గా క్రేజీ బ్యూటీ.. పాపం ఆమని సైడ్ చేశారుగా..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో నాగ చైతన్య ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే నాగ చైతన్య ప్రస్తుతం చందు మండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తాండెల్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు . ఈ మూవీ ని వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 7 వ తేదీన విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మేకర్స్ విడుదల చేశారు. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.

ఇకపోతే నాగ చైతన్య తన తదుపరి మూవీ ని విరూపాక్ష ఫెమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇకపోతే ఈ సినిమాలో నాగ చైతన్య కు జోడిగా నటించబోయే హీరోయిన్ కి సంబంధించిన కొన్ని వార్తలు గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితం నాగ చైతన్య , కార్తీక్ దండు కాంబోలో రూపొందబోయే సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించబోతుంది అని ఓ వార్త వైరల్ అయింది.

ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు మీనాక్షి చౌదరి ని కాకుండా ఈ సినిమాలో నాగ చైతన్య కు జోడిగా శ్రీ లీల ను తీసుకోవాలి అనే ఆలోచనకు మేకర్స్ వచ్చినట్లు , అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ ను సంప్రదించి కథను మొత్తం వివరించగా ఆమె కూడా నాగ చైతన్య , కార్తీక్ దండు కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు త్వరలోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nc

సంబంధిత వార్తలు: