ఫ్రెండ్ అని నమ్మితే అలాంటి పని.. ధనుష్ నిజ స్వరూపం బయట పెట్టిన నయన్..?

Pandrala Sravanthi
రీసెంట్గా కోలీవుడ్ లో ఏదైనా హాట్ టాపిక్ ఉందా అంటే అది కేవలం  నయనతార ధనుష్ ల మధ్య వివాదం మాత్రమే.. నయనతార ధనుష్ నిర్మించిన నానుం రౌడీ ధాన్ మూవీలోని ఒక చిన్న బిట్ ని తన బియాండ్ ది ఫేయిట టేల్ డాక్యుమెంటరీకి వాడుకోవడంతో ధనుష్ దీనిపై 10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. దీంతో ధనుష్ నిజ స్వరూపం ఎలాంటిదో నయనతార ఒక పెద్ద పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. దీంతో ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నయనతార ధనుష్ గురించి మాట్లాడుతూ.. ధనుష్ ని ఫ్రెండ్ అనుకున్నాను. కానీ ఆయన ఇలా చేశారు. ఆయన సినిమాలోని ఓ బిట్ ని వాడుకోవడానికి ముందు ధనుష్ ని కలవాలని చూసాను. కానీ ఆయన టైం ఇవ్వలేదు. నాకు మేనేజర్స్ కి కాల్ చేసే అలవాటు లేదు.

 కానీ నా డాక్యుమెంటరీ కోసం మొదటిసారి ధనుష్ మేనేజర్ కి కాల్ చేశాను. అది కూడా కుదరలేదు. అసలు మన మధ్య జరిగిన తప్పేంటి..ఈ పదేళ్లలో ఇద్దరి మధ్య వైరం ఎక్కడ ఏర్పడింది.. అనే విషయాలు మాట్లాడి పరిష్కారం చేసుకుందాం అనుకున్నాను. కానీ ఏది కుదరలేదు. అసలు మా మధ్య జరిగిన గొడవ ఏంటో తెలుసుకుందామంటే ఆయన సమయం ఇవ్వలేదు.ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఎప్పుడైనా ఎదురుపడితే మొహం చూసి హాయ్ చెప్పుకోవాలి.కానీ ఆయన వైపు నుండి ఎలాంటి సమాధానం లేదు. తన సినిమాలోని సీన్లు వాడుకోవడానికి ఒప్పుకోలేదు.

ఒక నాలుగు లైన్లు వాడుకుంటానని అడిగినా కూడా నో చెప్పాడు. బిహైండ్ ది సీన్స్ కి సంబంధించి మా పర్సనల్ అని చెప్పినా కూడా దాన్ని ధనుష్ అర్ధం చేసుకుంటాడు అనుకున్నాం. కానీ ఆయన అర్థం చేసుకోలేదు.నేను తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది..ధనుష్ ని ఫ్రెండ్ అనే అనుకున్నాను. కానీ ఇలా చేశాడు అంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో నయనతార ధనుష్ నిజస్వరూపం మొత్తం బయట పెట్టింది.ఇక నయనతార మాటలు వింటుంటే ధనుష్ ని ఎన్నిసార్లు కలవాలని నయనతార ప్రయత్నించినప్పటికీ ఆయన మాత్రం సమయం ఇవ్వలేదని తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: