ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 2 సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. విడుదలైన తొలి రోజు నుంచే రికార్డు కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతోంది.పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్. ఈ డైలాగ్ ను అక్షరాలా నిరూపించాడు అల్లు అర్జున్.ఇక ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన్న నటించగా.. కిస్సిక్ సాంగ్ లో అందాల శ్రీలీల మెరిసింది.తాజాగా ఈ సినిమా రూ. వెయ్యి కోట్ల క్లబ్ లో చేరింది. కేవలం 6 రోజుల్లోనే పుష్ప 2 రూ.1002 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ తాజాగా పోస్టర్ ను విడుదల చేశారు.కాగా, అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సినిమాగా పుష్ప 2 చరిత్ర సృష్టించింది. ఇక, నార్త్ లో అయితే, ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. హిందీలోనే ఈ సినిమా దాదాపు రూ.400కోట్లు రాబట్టింది.
రాబోవు రోజుల్లో ఈ సినిమా మరికొన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇండియాతో పాటు విదేశాల్లో కూడా ఈ సినిమాకు అద్భుతమైన ఆదరణ లభిస్తున్నదని చిత్ర బృందం పేర్కొంది.ఈ క్రమంలో నే ఈ చిత్రం యూఎస్ వసూళ్లు ఇప్పుడు తెలుస్తున్నాయి.వీక్ డేస్ లోకి వచ్చిన పుష్ప 2 అక్కడ కొంచెం డల్ కాగా ఇపుడు 11 మిలియన్ డాలర్లు గ్రాస్ దిశగా కొనసాగుతుంది. లేటెస్ట్ గా సినిమా 10.9 మిలియన్ డాలర్లు గ్రాస్ మార్క్ ని టచ్ చేసేసింది. ఇక నెక్స్ట్ స్టాప్ 11 మిలియన్ అని చెప్పొచ్చు.ఇదిలావుండగా ఇంకా పుష్ప సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్స్ క్యూ కడుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లోనూ ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.ఇంకోపక్క పార్ట్ 1 కి పార్ట్ 2 కి సంబంధం లేదు అని, అసలు పుష్ప 2 లో కథ లేదని వార్తలు కూడా వచ్చాయి. కానీ, ఆ మాటలను ఫ్యాన్స్ ఎవరు పట్టించుకోకుండా బన్నీ నటన కోసమే థియేటర్లకు క్యూ కడుతున్నారు. మరి ముందు ముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి.