యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా రాజాసాబ్ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు డార్లింగ్. డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్న ఈ మూవీ వింటేజ్ ప్రభాస్ కనిపించనున్నాడు. దీంతో ఈ మూవీపై మరింత క్యూరియాసిటీ నెలకొంది. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. మరోవైపు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడు. వీరిద్దరి కాంబోలో వచ్చే మూవీకి స్పిరిట్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. పోలీస్ డ్రామాగా రానున్న ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిటింగ్స్ ఇటీవలే స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమా అప్డేట్స్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాట్లు తెలుస్తోంది. స్పిరిట్ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు తొలి రోజే రూ. 150 కోట్ల వసూళ్లు రావడం ఖాయమని గతంలోనే సందీప్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.అయితే అయితే స్పిరిట్ మేకర్స్.. రూ.1000 కోట్లను టార్గెట్ గా పెట్టుకున్నారని ఇప్పటికే గుసగుసలు వినిపించాయి.అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. పుష్ప -2 వసూళ్ల సునామీ తర్వాత.. స్పిరిట్ ఓపెనింగ్స్ గురించి సందీప్ తక్కువ అంచనా వేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. స్పిరిట్ ఓపెనింగ్స్ రూ.150 కోట్ల కన్నా ఎక్కువ వస్తాయని అంచనా వేస్తున్నారు.ఇప్పటి వరకు నాన్ రాజమౌళి, నాన్ బాహుబలి రికార్డులు మాత్రమే ఉంటే.. ఇక నుంచి నాన్ పుష్ప 2 రికార్డులు అని అంటారు. దీంతో ఇప్పుడు పుష్ప రికార్డును స్పిరిట్ బ్రేక్ చేయాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తొలి రోజు వరల్డ్ వైడ్ గా రూ.300 కోట్ల గ్రాస్ ను టచ్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. రూ.200 కోట్ల మార్క్ ను క్రాస్ చేయడం పక్కా అని అంటున్నారు.సందీప్ రెడ్డి వంగా బ్రాండ్ కు ప్రభాస్ స్టార్ డమ్ తోడు అవుతుంది కనుక.. సినిమాపై అంచనాలు వేరే లెవెల్ లో ఉన్నాయి.