2024లో ఇప్పటికి నెంబర్ వన్ గా ప్రభాస్ సినిమా.. ఆ రికార్డును కొట్టడం పుష్ప వల్లయేనా..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సంవత్సరం కల్కి 2898 AD అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్గా నటించగా ... దీపికా పదుకొనే , అమితా బచ్చన్ ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా విడుదల ఆయన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమా ఏకంగా టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 1150 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి ఈ సంవత్సరం హైయెస్ట్ కలెక్షన్లను రాబట్టిన సినిమాగా ఇప్పటి వరకు కొనసాగుతుంది.

ఇకపోతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప పార్ట్ 2 అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమా రెండవ భాగం పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే పుష్ప పార్ట్ 2 మూవీ ని డిసెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు.

ఇకపోతే ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఇప్పటికే ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. మరి ఈ సినిమా ఊపు చూస్తుంటే మరి కొన్ని రోజుల్లోనే కల్కి 2898 AD సినిమా కలెక్షన్లను క్రాస్ చేసే విధంగా ఉంది. మరి ఈ సినిమా కల్కి 2897 AD సినిమా కలెక్షన్లను కనుక క్రాస్ చేసినట్లయితే ఈ సంవత్సరం అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన ఇండియన్ సినిమాలలో పుష్ప పార్ట్ 2 మూవీ మొదటి స్థానంలోకి వచ్చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: