కొడుకులు కూతురుకు వాటాలు .. ముగ్గురు బిడ్డలకు మోహన్ బాబు ఎంత ఆస్తి ఇచ్చారంటే..?

Amruth kumar
తెలుగు చిత్ర పరిశ్రమలో బడా ఫ్యామిలీ గా గుర్తింపు తెచ్చుకున్న మంచు కుటుంబం ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన ఈ ఫ్యామిలీ ఇప్పుడు ఆస్తుల వివాదాల కారణంగా రోడ్డున పడటంతో పరువు పోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి .. ప్రధానంగా జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటివద్ద ఏకంగా ఇద్దరు అన్నదమ్ములు పోటాపోటీగా ప్రెస్మీట్లో పెడుతూ ఒకరి మీద ఒకరు దూషణలు చేసుకుంటున్నారు. మనోజ్ ని ఇంట్లోకి రాకుండా మోహన్ బాబు సిబ్బంది అటుకోవడం మనోజ్ గేట్లు బద్దలు కొట్టడం లోపలికి వెళ్ళటం .. మోహన్ బాబు కోపంతో అక్కడికి వచ్చిన జర్నలిస్టులను కొట్టడం ఇలా మంచు కుటుంబంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు . ఇప్పటికే ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు ఈ మంచు కుటుంబ సభ్యులు.

 
అయితే ఇదంతా ఆస్తులు కోసమే అనే వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో మోహన్ బాబు ఆస్తులు విలువ ఎంత ? అయిన తన ఆస్తుల్లో ఎవరికీ అంత వాటా ఇచ్చారు ? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .  ముందుగా మోహన్ బాబు వ్యక్తిగత జీవితానికి వస్తే ముందుగా. . ఆయన మొదట విద్యాదేవిని పెళ్లి చేసుకున్నారు .. ఇక వీరికి కూతురు మంచు లక్ష్మీ ప్రసన్న , కుమారుడు మంచు విష్ణు జన్మించారు .. అయితే మోహన్ బాబు జీవితంలో ఊహించని విధంగా విద్యాదేవి మరణించడంతో ఆమె చెల్లి అయిన నిర్మల దేవిని దాస‌రి నారాయణరావు ప్రోత్బలంతో రెండో పెళ్లి చేసుకున్నారు మోహన్ బాబు .. ఆ తర్వాత వీరికి మంచు మనోజ్ జన్మించారు.

 
అయితే మోహన్ బాబు తన ముగ్గురు పిల్లలకు ఆస్తి ఏ విధంగా పెంచారు అనే విషయాలు కూడా వైరల్ గా మారాయి.   మోహన్ బాబు ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తవుతుంది ఈ సమయంలో 500 పైగా సినిమాల్లో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా ప‌లు సినిమాలను తెరకెక్కించాడు .. అలాగే కొంతకాలం రాజకీయాల్లో కూడా ఆయన ఎంపీగా కూడా పనిచేశారు .. ఇక 1992లో తిరుపతిలో సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ను స్థాపించారు .  ప్రస్తుతం ఈ ట్రస్ట్ ఇప్పుడు యూనివర్సిటీ స్థాయికి చేరుకుంది .. ఇక ఇక్కడ అంతర్జాతీయ స్కూల్ తో పాటు ఇంజనీరింగ్ , డిగ్రీ ఎంబీఏ వంటి అన్ని రకాల కాలేజీలు కూడా అందులో ఉన్నాయి.

 
వీటితోపాటు ఆంధ్రప్రదేశ్ తిరుపతి సమీపంలో ఉన్న  ఎస్వీఈటి విద్యాసంస్థలు కూడా ఈ కుటుంబానికి సొంతం .. అంతేకాకుండా సొంత ఊరులో ఒక ఇల్లు , వ్యవసాయ భూమి కూడా ఉన్నట్టు తెలుస్తుంది .. మోహన్ బాబు తన కొడుకు కూతుళ్లకు ఆస్తి పంపకాల విషయానికి వస్తే .. కూతురు లక్ష్మీప్రసన్న కు ఫిలింనగర్ లో ఉన్న ఇంటిని ఇచ్చినట్లు స్వయంగా మోహన్ బాబు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు .. అలాగే పెద్ద కొడుకు విష్ణు హీరోగా సినిమాలు చేస్తూనే తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ వ్యవహారం మొత్తం చూసుకుంటున్నారు .. అంతేకాకుండా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ బాధ్యతలు కూడా విష్ణు చేతుల్లోనే ఉన్నాయి .. అలాగే తిరుపతిలో ఉన్న ఆస్తులు అన్నింటిని కూడా మోహన్ బాబు తన పెద్దకొడికి అప్పగించినట్లు సమాచారం.

 
ఇదే క్రమంలో చిన్న కొడుకు మనోజ్ కి హైదరాబాద్ శివారులో ఉన్న ఒక ఫ్లాట్ ను మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తుంది .. మనోజ్ భార్య పిల్లలతో కలిసి అక్కడే ఉంటున్నాడు .. ఇవే కాకుండా మిగతా ఆస్తులు కూడా ముగ్గురు పిల్లలకు సమానంగా పంచుతానని పలు సందర్భాల్లో చెప్పిన మోహన్ బాబు మనోజ్ విషయంలో అన్యాయం చేశారని వార్త మంచు ఫ్యామిలీ గొడవ బయటికి రావటంతో మరోసారి తెరపైకి వచ్చింది . అటు మనోజ్ కూడా తన తండ్రి ఆస్తులు విషయంలో తనకు అన్యాయం చేశారని కూడా గట్టిగా చెబుతున్నట్లు సమాచారం . . శ్రీ విద్యానికేతన్ హక్కులన్నిటిని విష్ణుకి ఇవ్వటంతో మనోజ్ గొడవపడ్డారు ఇదే విషయంపై పలుమార్లు మంచు ఫ్యామిలీతో గొడవకు దిగినట్లు తెలుస్తుంది . ఏదేమైనా ఆస్తులు విషయంలో మంచు మనోజ్ కి అన్యాయం జరిగిందని నేటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి మంచు ఫ్యామిలీ ఆస్తులు గొడవలు రాబోయే రోజుల్లో ఇంకా ఎంత రచ్చకెక్కితే చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: