2024 లో గూగుల్లో ఈ హీరోయిన్ కోసం ఎక్కువ సెర్చ్ చేశారంటే .. ఆమె అంత స్పెషలా..?

Amruth kumar
ప్రజెంట్ సోషల్ మీడియా యుగం నడుస్తుంది సాధారణ జనం నుంచి సెలబ్రెటీల వరకు సోషల్ మీడియాని ఓ సాధనంగా వాడుతున్నారు .. అలాగే సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులకు ఈజీగా దగ్గర అవచ్చునే అభిప్రాయం చాలా మంది సెలబ్రిటీల్లో ఉంది .. అయితే కొంతమంది సెలబ్రెటీలు సోషల్ మీడియా ద్వారా తమలో ఉన్న టాలెంట్ను కూడా బయటపెడుతున్న‌రు .. ఈ లిస్టులో హీరోయిన్లు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు .. స్టార్ హీరోయిన్లు తమ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా ఉండేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు .. అయితే ఈ 2024 సంవత్సరంలో సోషల్ మీడియాలో నెటిజన్లు ఎక్కువగా ఓ హీరోయిన్ కోసం వెతికేశారు .

ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు .. బాలీవుడ్ స్టార్ బ్యూటీ కీయారా అద్వానీ .. బాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ ఎవరంటే అందరూ టక్కున చెప్పే పేరు కూడా కీయారా అద్వాని .. వరుస సినిమాల్లో నటిస్తూ అక్కడ స్టార్ హీరన్ గా కీయారా మారిపోయింది .. ఇదే క్రమంలో తెలుగులో కూడా మహేష్ , రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి సౌత్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది .. ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ ఛేంజ‌ర్‌ సినిమాలో నటించింది .. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .. ఇక బాలీవుడ్ హీరో సిద్దార్ధ్ మల్హోత్రాను గ‌తేడాది ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే .. అంతేకాకుండా  బాలీవుడ్ లో మ‌రో మూడు సినిమాల్లో కూడా నటిస్తూ బిజీ హీరోయిన్గా కీయార మారిపోయింది ..

ఇక తాజాగా కీయార అద్వానీ ఓ అరుదైన ఘనతను అందుకుంది .. 2024లో సోషల్ మీడియాలో నెటిజెన్లు ఎక్కువగా వెతికిన హీరోయిన్గా కీయారా రికార్డు సొంతం చేసుకుంది . కీయార అద్వానీ నటించిన‌ సినిమాలతో పాటు ఆమె వ్యక్తిగత జీవిత విషయాల గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో ఇంటర్నెట్లో వెతికారు .. ఇక ఇదే క్రమంలో కీయార అద్వానీ ప్రెగ్నెంట్ అయిందంటూ వచ్చిన వార్తలు కూడా ఆమెను సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా చేసింది .. అలాగే గేమ్ చేంజ‌ర్ టీజర్ రిలీజ్ సమయంలో కూడా కీయార అద్వానీనే హాట్ టాపిక్ గా నిలిచింది .. ఇలా మొత్తానికి కీయారా అద్వానీ గురించి సోషల్ మీడియాలో నెటిజెన్లు అత్యధికంగా వెతికారు ఈ సంవత్సరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: