చైనా బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతున్న మహారాజా.. 12 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా..?

Pulgam Srinivas
తమిళ సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన నటులలో విజయ్ సేతుపతి ఒకరు. ఈయన ఎన్నో సినిమాల్లో హీరోగా , కీలక పాత్రలలో , ముఖ్య పాత్రలలో , విలన్ పాత్రలలో నటించి అద్భుతమైన గుర్తింపును ఇండియా వ్యాప్తంగా సంపాదించుకున్నాడు. ఇకపోతే విజయ్ సేతుపతి కొన్ని సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన సైరా నరసింహా రెడ్డి మూవీ లో కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో విజయ్ సేతుపతి కి తెలుగు లో ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది. ఇక పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్గా బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన మూవీ లో విజయ్ సేతుపతి ప్రతి నాయకుడి పాత్రలో నటించి అద్భుతమైన గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో సంపాదించుకున్నాడు.

ఇకపోతే విజయ్ సేతుపతి తాజాగా మహారాజా అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా లోని విజయ్ సేతుపతి నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా తెలుగు లో కూడా సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇలా అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను చైనా లో కర్మ అండ్ రిట్రీబ్యూషన్ అనే టైటిల్ తో నవంబర్ 29 న 40 వేల స్క్రీన్ లలో విడుదల చేశారు. ఇక 12 రోజుల్లో చైనా లో ఈ మూవీ కి ఏకంగా 70 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా మహారాజ సినిమా చైనా లో అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vs

సంబంధిత వార్తలు: