తల్లీ కూతుళ్ళను వాడేసిన ఒకేఒక్క టాలీవుడ్ స్టార్ హీరో.!
అయితే విచిత్రంగా తల్లీ కూతురు ఇద్దరి తో వేరు వేరు సినిమాల్లో రొమాన్స్ చేసిన రికార్డ్ మాత్రం టాలీవుడ్ మొత్తంమీద పెద్దాయన ఎన్టీఆర్ కే దక్కింది. ఇంతకీ ఆ తల్లీ కూతురు హీరోయిన్లు ఎవరో తెలుసా.వాళ్ళు ఎవరో కాదు జయచిత్ర ఆమె తల్లి అమ్మాజి. అవును జయచిత్ర అందరికి తెలిసే ఉంటుంది. హీరోయిన్ గా చాలామందికి తెలియకపోయినా.. ఆమెవిలన్ గా మాత్రం చాలా సినిమాల్లో కనిపించారు. అబ్బాయిగారు సినిమాలో వెంకటేష్ మారుతల్లిగా విలనిజం పండించిన జయచిత్ర.. బాలయ్య బాబు సమరసింహారెడ్డిలో కూడా మారు తల్లిగా హోటల్ ఓనర్ గా అలరించారు.ఇక జయచిత్ర తల్లి అమ్మాజి కూడా హీరోయిన్ నే. ఆమెను అప్పట్లో జయశ్రీ అని కూడా పిలిచేవారు. అయితే వీరిద్దరు అన్న నందమూరి తారకరామారావు తో హీరోయిన్లు గా నటించారు. ఒక్క హీరోతో తల్లీ కూతురు నటించడం మాత్రం ఒక్క రామారావుతో మాత్రమే సాధ్యం అయ్యింది. అమ్మాజీ అలియాస్ జయశ్రీ తెలుగులో రోజులు మారాయి. దైవబలం లాంటి సినిమాలలో నటించారు. అయితే ఈ ఇద్దరితోను సీనియర్ ఎన్టీఆర్ రొమాన్స్ చేసి ఓ అరుదైన రికార్డు సృష్టించారు.ఇక అమ్మాజీ కూతురు జయచిత్ర 1976 లో వచ్చిన మా దైవం సినిమాతో మొదటిసారిగా ఎన్టీఆర్ తో హీరోయిన్ గా నటించి మెప్పించింది.