పెళ్లికి ముందే విడాకుల అగ్రిమెంట్..చైతూ శోభిత పెళ్లికి ముందు ఇంత జరిగిందా.?

Pandrala Sravanthi
ఏంటి నాగచైతన్య శోభితలు పెళ్లికి ముందే విడాకుల గురించి అగ్రిమెంట్ చేసుకున్నారా.. ఇంతకీ ఆ విడాకుల అగ్రిమెంట్లో ఉన్నది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. నాగచైతన్య శోభిత ఇద్దరు  ప్రేమించుకొని కొద్ది రోజులు డేట్ చేశాక వివాహం చేసుకున్నారు.అయితే వీరి పెళ్ళై కనీసం వారం రోజులు కూడా దాటకముందే వీరి పెళ్లిపై కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి. అదేంటంటే..పెళ్లికి ముందే శోభిత నాగచైతన్యకి ఒక కండిషన్ పెట్టిందట. అదేంటంటే.. గొడవలు వచ్చి విడిపోతే పెళ్లయ్యాక నీ ఆస్తిలో సగభాగం నాకు భరణం కింద ఇవ్వాలి అని డిమాండ్ చేసిందట. అయితే నాగచైతన్య దీనికి ఒప్పుకున్నప్పటికీ నాగార్జున మాత్రం దీనికి ఒప్పుకోలేదట.

ఎందుకంటే నాగార్జున ఆస్తిలో సగభాగం నాగచైతన్యకి కూడా వెళ్తుంది.ఇక ఆ ఆస్తి అక్కినేని నాగేశ్వరరావుది.అలా మా నాన్న నుండి నాకు వచ్చిన ఆస్తి నా నుండి నా కొడుకుకి కూడా వస్తుంది.ఆ ఆస్తిలో సగభాగం ఇవ్వడానికి అస్సలు కుదరదు. అది మా నాన్న కష్టార్జితం.. కావాలంటే ఒకవేళ మీకు పెళ్లయ్యాక విడిపోయే ఆలోచనలు వస్తే నాగచైతన్య సంపాదించిన ఆస్తిలో సగభాగం భరణం కింద ఇస్తాడు కానీ మా నాన్న నుండి వచ్చిన వారసత్వపు ఆస్తిలో నీకు ఎలాంటి హక్కు లేదు అని ముందుగానే నాగార్జున చెప్పారట.

 ఇక నాగార్జున మాటలకు ఏకీభవించిన శోభిత ఏవైనా విభేదాలు వచ్చి ఇద్దరు విడిపోతే మాత్రం కచ్చితంగా నాగచైతన్య కష్టపడి సంపాదించిన ఆస్తిలో సగం భరణం కింద ఇస్తానని ముందుగానే అగ్రిమెంట్ చేసుకున్నట్టు ఓ రూమర్ వినిపిస్తుంది. అయితే ఈ రూమర్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్  అవ్వడంతో అక్కినేని ఫ్యాన్స్ ఈ రూమర్ పై ఫైర్ అవుతున్నారు.పెళ్లి చేసుకొని వారం కూడా కాకముందే ఈ జంటపై రూమర్లు మొదలు పెట్టేసారా..పెళ్లి కాకుండానే విడాకుల గురించి ఎవరైనా ఆలోచిస్తారా అంటూ ఈ రూమర్స్ స్ప్రెడ్ చేసిన వారిపై ఫైర్ అవుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: