ప్రియుడుతో కలిసి ఏడడుగులు వేసిన కీర్తి సురేష్.. ఫొటోస్ వైరల్..!
గత కొన్ని రోజులుగా కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించి పనులకు కూడా జరుగుతున్నట్లు అందుకు సంబంధించి ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. తన లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్ ఆంటోనీ నీ ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈరోజు. గోవాలో వీరి పెళ్లి ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో సన్నిహితుల సమక్షంలో జరిగినట్లు తెలుస్తోంది. హిందూ సాంప్రదాయ పద్ధతిలో కీర్తి సురేష్ వివాహం జరిగినట్లుగా సమాచారం అలాగే మరొక పద్ధతి అయిన క్రిస్టియన్ లో కూడా పెళ్లి జరుగుతుందని టాక్ కూడా ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది.
మొత్తానికి కీర్తి సురేష్ సైలెంట్ గా ఏడు అడుగులు వేసి అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ ఫోటోలకు అభిమానులు నేటిజన్స్ సినీ సెలబ్రిటీలు సైతం ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ ఫోటోలో కీర్తి సురేష్ ఆనందానికి అవధులు లేకుండా ఉన్నట్టుగా కనిపిస్తోంది. అలాగే తనకు ఇష్టమైన ప్రియుడుతో ఏడడుగులు వేయడం మరింత ఆనందంగా ఉందన్నట్టుగా కనిపిస్తోంది. కీర్తి సురేష్ ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక సినిమాలో నటిస్తూ ఉన్నది. అలాగే రివాల్వర్ సీత అనే చిత్రంలో కూడా నటిస్తున్నది.