పెద్ద బూతు మాటలు కూడా పట్టించుకోని సాయి పల్లవి.. ఇంత చిన్న విషయాన్ని సీరియస్ గా తీసుకోవడానికి కారణం అదేనా..?
ప్రముఖ తమిళ్ పత్రిక ఛానల్లో సాయి పల్లవి కి సంబంధించి ఓ వార్త ప్రచురితమైంది . "రామాయణం సినిమా కోసం ఆమె పూర్తిగా నాన్ వెజ్ మానేసింది అని.. అంతేకాకుండా సాయి పల్లవి ఒక ప్రత్యేకమైన చెఫ్ బృందాని నియమించుకుందని..ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ చెఫ్ బృందాని తీసుకువెళ్తుంది అని.. సాయి పల్లవి రామాయణం సినిమా కోసం ఎక్కువగా కష్టపడుతుంది అన్నట్లు ఆ వార్త ప్రచురితమైంది . అయితే సాయి పల్లవి ఆ లింక్ షేర్ చేస్తూ మరొకసారి ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తే ఈసారి ఊరుకోను.. ఇన్నాళ్లు నేను చాలా సైలెంట్ గా ఉన్నాను.. నాకెందుకులే నాకెందుకులే అని వదిలేసాను.. కానీ ఈసారి మాత్రం లీగల్గా యాక్షన్ తీసుకుంటాను" అంటూ స్ట్రైట్ గా వార్నింగ్ ఇచ్చింది .
దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు సాయి పల్లవి పేరు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇన్నాళ్లు సాయి పల్లవి చాలా సైలెంట్ గా ఉండింది . తనపై ఎన్నెన్నో బూతులు మాటల ట్రోలింగ్ కూడా జరిగింది . అప్పుడు కూడా పట్టించుకోలేదు . కానీ ఎందుకు ఈసారి సాయి పల్లవి ఇంత సీరియస్ అయింది అంటే మాత్రం సాయి పల్లవి ఎక్కడికి వెళ్తే అక్కడ కి చెఫ్ బృందాన్ని తీసుకెళ్తుంది అన్న వర్డ్ కారణంగానే హర్ట్ అయ్యింది అని ..అసలు సాయి పల్లవికి అలాంటి ఒక బృందమే లేదు అని.. సాయి పల్లవి నాన్ వేజ్ అస్సలు తినదు అని,, సాయి పల్లవి కేవలం వెజిటేరియన్ మాత్రమే తింటూ వస్తుంది అని.. ఆ కారణం గా సాయి పల్లవి ఫుల్ ఫైర్ అయిపోయారు అంటూ సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చింది అంటున్నారు అభిమానులు..!