"ముందు చూస్తే నుయ్యి-వెనక చూస్తే గొయ్యి".. సుకుమార్ ఇలా ఇరుక్కుపోయాడు ఏంటి..?
మరీ ముఖ్యంగా పుష్ప2 సినిమాలో జాతర ఎపిసోడ్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ - సుకుమార్ డైరెక్షన్ ని ప్రశంసిస్తున్నారు . సుకుమార్ డైరెక్షన్ సినిమాకి కర్త - కర్మ - క్రియ అంటూ ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు. అయితే అటువంటి సుకుమార్ నుంచి నెక్స్ట్ వచ్చే సినిమా కూడా అదే రేంజ్ లో ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు . ఇక్కడే పెద్ద తలనొప్పి ఫేస్ చేయాల్సి వస్తుంది సుకుమార్ . సుకుమార్ నెక్స్ట్ కమిట్ అయిన హీరో రామ్ చరణ్.
ఆల్రెడీ మెగా వర్సెస్ అల్లు వార్ సోషల్ మీడియా లో ఎలా ట్రెండ్ అవుతుందో మనం చూస్తున్నాం. పుష్ప 2 సినిమా ఎంత హిట్ అయిందో అంతటి హిట్ సినిమా రామ్ చరణ్ కి ఇస్తేనే సుకుమార్ బ్రతికి పోతాడు. లేకపోతే మెగా ఫ్యాన్స్ ని హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ చేస్తారు . ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా తన వర్క్ చేసే సినిమా హిట్ అవ్వాలని అనుకుంటారు . కానీ కొన్నిసార్లు అది హిట్ అవుతుంది మరి కొన్నిసార్లు ప్లాప్ అవుతుంది . అయితే ఇక్కడ ఫ్యాన్స్ ప్రెసర్ కారణంగా సుకుమార్ - చరణ్ తో అంత పెద్ద హిట్ కొట్టగలడా..? అనేది అందరికీ బిగ్ డౌట్ గా మారింది. సినిమా నుంచి వెనక్కి తప్పుకుంటే ఒక తలనొప్పి సినిమాని తెరకెక్కించి రిలీజ్ చేస్తే హిట్ అవ్వకపోతే మరో తలనొప్పి..ఇలా మధ్యలో ఇరుక్కుపోయాడు సుకుమార్..!