1000 కోట్ల క్లబ్‌లో పుష్ప2 మాత్రమే కాదు .. ఇండియన్ సినిమాల్లో ఈ రికార్డు సాధించిన హీరోలు వీరే..!

Amruth kumar
ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద తెలుగు సినిమాలు అదిరిపోయ్యే కలెక్షన్ తో రికార్డులు కొల్లగొడుతున్నాయి .. తాజాగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన పుష్ప2  అంతకుమించిన స్థాయిలో రికార్డు కలెక్షన్లు కొల్లగొడుతుంది .. తాజాగా ఈ సినిమా ఆరు రోజుల్లో 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది .. ఇలా ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత వేగంగా 1000 కోట్లు కలెక్ట్ చేసిన తొలి సినిమాగా పుష్ప2 రికార్డు క్రియేట్ చేసింది . కేవ‌లం ఒక తెలుగులోనే కాకుండా రిలీజ్ అయిన అన్ని భాషల్లో  సునామీలా దూసుకుపోతుంది .. ప్రధానంగా పుష్ప2 బాలీవుడ్ లో రికార్డు కలెక్షన్లతో రికార్డులు బద్దలు కొడుతుంది . బాలీవుడ్ లో ఈ సినిమా ఆరు రోజుల్లో ఏకంగా 375 కోట్ల కలెక్షన్ రాబట్టింది. కాగా ఈ సినిమా 1000 కోట్ల క్లబ్లో చేరిన ఎనిమిదో ఇండియన్ సినిమాగా పుష్ప2 నిలిచింది .. అలాగే తెలుగులో నాలుగో సినిమా.  గతంలో బాహుబలి 2 , త్రిబుల్ ఆర్ , కల్కి సినిమాలు 1000 కోట్ల కలెక్షన్లు సాధించాయి .

ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక కలెక్షన్లు సాధించిన రికార్డ్ ఆమిర్ ఖాన్ దంగల్ పేరు మీదే ఉంది .. నితీష్ తివారి తెర్కక్కించిన ఈ స్పోర్ట్స్ డ్రామా 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా ఓవరాల్ గా  ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది .ఇక దంగ‌ల్‌ తర్వాత రెండో స్థానంలో బాహుబలి 2 సినిమా ఉంది .. దర్శక ధీరుడు రాజమౌళి తెర్కక్కించిన ఈ విజువల్ వండర్లో ప్రభాస్ , అనుష్క, రానా , తమన్న , రమ్యకృష్ణ వంటి వారు కీలకపాత్రలో నటించారు . ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 1800 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టింది . ఈ జాబితాలో ఉన్న మరో తెలుగు సినిమా త్రిబుల్ ఆర్ .. రాజమౌళి తెరకెక్కించిన ఈ పీరియాటికల్ యాక్షన్ మూవీలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా నటించారు .. ఆస్కార్ , గోల్డెన్ గ్లోబల్ లాంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులో గెలుచుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు 1390 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

 ఈ సినిమా తర్వాత కన్నడ చిత్ర పరిశ్రమను తలెత్తుకునేలా చేసిన సినిమా యాష్ హీరోగా వచ్చిన కే జి ఎఫ్ .. ఈ సినిమాకు సీక్వల్ గా వచ్చిన కే జి ఎఫ్ 2 ప్రపంచ బాక్సాఫీస్ వద్ద 1280 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది . ఇక మరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాల తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన మరో విజువల్ వండర్ కల్కి 2898 ఏడి .. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వ‌చ్చిన‌ ఈ సినిమాలో దీపికా పదుకొణె, అమితాబ బచ్చన్ ముఖ్యపాత్రలో నటించారు .. ఇక ఈ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా సుమారు 1200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.  ఈ సినిమాలతో పాటు బాలీవుడ్ భాద్‌షా షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా 1148 కోట్ల వసూలు రాబట్టింది .. అంతకుముందు రిలీజ్ అయిన షారుక్ మరో సినిమా పఠాన్  కూడా 1000 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: