బాలయ్యకు.. మోహన్‌బాబుకు తేడా ఎక్కడ... ?
ప్రస్తుతం టాలీవుడ్ ను .. అటు తెలుగు మీడియాను ఓ ఊపు ఊపుతోన్న వ్యవహారం ఏదైనా ఉంది అంటే అది మంచు ఫ్యామిలీ వివాదం. సీనియర్ నటుడు .. క్రమ శిక్షణకు మారు పేరు అయిన ఈ ఫ్యామిలీ లో అన్న దమ్ములు అయిన మనోజ్ కుమార్ .. విష్ణు ఇద్దరూ కూడా రోడ్డు న పడ్డారు. ఇక్కడ తప్పు ఎవరిది ? అన్నది వేరే వ్యవహారం. అటు మంచు విష్ణు మా అధ్యక్షుడి గా వరుసగా రెండో సారి కొనసాగుతున్నారు. అంత మంచి పదవిలో ఉండి విష్ణు తన కుటుంబ గొడవను సర్దు బాటు చేసుకో లేకపోవడం ఆయనకు మైనస్సే. అటు సీనియర్ నటుడి గా ఇండస్ట్రీ లో గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నో గొడవల ను చిటికెన వేలు తో పరిష్కరించారు మోహన్ బాబు.
ఇప్పుడు ఆయన ఇంట్లో .. ఆయన ఇద్దరు వారసులు కూడా రోడ్డెక్కడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇక్కడే మరో సీనియర్ నటుడు బాలయ్యకు.. మోహన్ బాబుకు కంపేరిజన్ చేసి కామెంట్లు పెడుతున్నారు. బాలయ్య కూడా కోపిష్టి అంటారు. అయితే బాలకృష్ణ చుట్టూ హీరోలు మొత్తం ఎందుకు సార్ సార్ అంటూ గౌరవంగా తిరుగుతారు ? అన్న ప్రశ్న ఉదయిస్తోంది. చాలా మంది ఎందుకు బాలయ్య కంపెనీ కోరుకుంటారు. అతని దగ్గర కల్మషం లేదు .. పెద్ద పెద్ద స్టార్లు అయినా కూడా ఆయన దగ్గర తగ్గే ఉంటారు. ఇందులో ఎవరూ కూడా బాలయ్య సమకాలీకుడు మోహన్ బాబు గడప కూడా తొక్కరు కారణం ఏంటంటే ఇంట్రస్టింగ్ ఆన్సర్లే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మోహన్ బాబుది స్వభావం చాలా మంది ఇష్ట పడరు అన్న టాక్ ఇండస్ట్రీ లో ఉంది. అందుకే చాలా మంది ఆయనకు దూరంగా ఉంటారని అంటారు.