వామ్మో: మత్తులో రెచ్చిపోయిన మనోజ్.. వీడియో వైరల్..!
మోహన్ బాబు మొదట విడుదల చేసిన ఆడియోలో మంచు మనోజ్ మద్యానికి బానిస అయ్యారని అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారని విధంగా తెలియజేశారు.. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఇప్పుడు తాజాగా మనోజ్ కి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో మనోజ్ మరి తమ బంధువుల మీద రెచ్చిపోయి మాట్లాడుతున్నట్లుగా ఒక వీడియో వైరల్ గా మారుతోంది. ఈ వీడియోలో మనోజ్ ఫైర్ అయిన వారు మోహన్ బాబు కుటుంబానికి సంబంధించిన పెద్దలు అన్నట్లుగా సమాచారం. వీరుతోనే మనోజ్ అమర్యాదగా ప్రవర్తించినట్లుగా సమాచారం.
నువ్వు ఎవడు.. ముసలోడివి .. మిమ్మల్ని ఎవరు ఎక్కడికి రమ్మన్నారు.. నా ఆస్తులు రాసివ్వు అంటూ కుటుంబ సభ్యులను కూడా బెదిరించారట. ఈ విషయాల పైన అటు చుట్టాలను కూడా మనోజ్ బెదిరించడం జరిగిందని సమాచారం. అందుకు సంబంధించి ఆలస్యంగా ఈ వీడియో వైరల్ గా మారుతున్నట్లు సమాచారం.. అయితే ఈ వీడియో చూసిన అభిమానుల సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోతు ఏంటి మనోజ్ ఇలా మారిపోయారు అంటూ ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి మంచు కుటుంబంలోని విభేదాలు ఇప్పటితో ఆగేలా కనిపించడం లేదు.