మంచు ఫ్యామిలీ లో గొడవలు..వైరల్ అవుతున్న చిరంజీవి (వీడియో)..!

Thota Jaya Madhuri
గత నాలుగు రోజుల నుంచి సోషల్ మీడియాలో..వెబ్ మీడియాలో టెలివిజన్ రంగంలో ఎక్కడ చూసినా కూడా మంచు మోహన్ బాబు ఫ్యామిలీ కి సంబంధించిన వార్తలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి .. వైరల్ అవుతున్నాయి. ఆ విషయం మనకు బాగా తెలుసు. సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీ పై ఎలాంటి ట్రోలింగ్ జరుగుతుందో కూడా తెలుసు. మంచు మోహన్ బాబు తన చిన్న కొడుకు మంచు మనోజ్ ను తన చిన్న కోడలు భూమా మౌనిక రెడ్డిని ఇంటి నుండి గెంటేశాడు అన్న వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.


స్వయాన మోహన్ బాబునే ఆడియో రిలీజ్ చేసి మరి మంచు మనోజ్ బాగా చెడిపోయాడు అని ఫుల్ తాగేసి పని వాళ్లపై క్రూరంగా బిహేవ్ చేస్తున్నాడు అంటూ ఆడియోలో చెప్పుకు వచ్చారు . అయితే మనోజ్ వర్షన్ మాత్రం వేరేలా ఉంది . ఇవ్వంతా ఆస్తి తగాదాలు అంటూ క్లారిటీగా అర్థమయిపోతుంది. ఇలాంటి క్రమంలోనే మీడియా మోహన్ బాబు ఇంటి చుట్టూ కవరేజ్ కోసం ప్రయత్నించగా కోపంలో మోహన్ బాబు మీడియా రిపోర్టర్ పై దాడి చేసిన విజువల్స్ కూడా వైరల్ అయ్యాయి.

 
ఇదే మూమెంట్లో సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా ట్రెండ్ అవుతుంది . గతంలో చిరంజీవిపై మీడియా వాళ్ళు ఎలా వార్తలు రాశారో.. ఎలా ఆయన వ్యక్తిగత విషయాలను ఇబ్బందికరంగా మార్చేశారో అందరికీ తెలిసిందే . దానికి సంబంధించి ఒక ఈవెంట్లో మాట్లాడుతూ చిరంజీవి సెటైరికల్గానే కౌంటర్ వేశాడు . ఆ వీడియోకి దాని కింద మోహన్ బాబు ఎలా అయితే రిపోర్టర్ ని కొట్టాడో ఆ వీడియోకి మ్యాచ్ చేస్తూ చిరంజీవి గుణం అది మోహన్ బాబు మనస్తత్వం ఇది అంటూ ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు . ప్రెసెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో మరొకసారి  వైరల్ అవుతుంది. మొత్తానికి మొహన్ బాబు ట్రోల్ చేసే ఏ ఛాన్స్ ని కూడా మిస్ చేసుకోవట్లేదు ఆకతాయిలు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: