ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ నటీనటుల బయోపిక్స్ తెరకెక్కిన సంగతి మనకు తెలిసిందే.కేవలం హీరో హీరోయిన్లవి మాత్రమే కాదు. గుర్తింపు పొందిన ఆటగాళ్లవి ఇలా ఎంతోమందివి బయోపిక్ లు వచ్చాయి. అలా వచ్చిన బయోపిక్ లలో సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ కూడా ఒకటి.ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ తో బాలకృష్ణ ఈ సినిమాను మన ముందుకు తీసుకువచ్చారు.. మరి అలాంటి ఈ సినిమా ఏ మేర హిట్ అయిందో ఇప్పుడు చూద్దాం.ఎవరైనా హీరో లేదా హీరోయిన్ బయోపిక్ తెరకెక్కించాలి అంటే కచ్చితంగా ఎన్నో విషయాలు చూసుకోవాల్సి ఉంటుంది. ఏ చిన్న మిస్టేక్ జరిగినా కూడా వాళ్ళ అభిమానులు అస్సలు ఒప్పుకోరు.
అలా మహానటి సినిమా తెరకెక్కించే సమయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి.ఆ విషయం పక్కన పెడితే.. సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ గా ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ ఒదిగిపోయి నటించారు. అలాగే ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించారు. అలాగే ఈ సినిమాలోని శ్రీదేవి పాత్రకు రకుల్ ప్రీత్ సింగ్,ఏఎన్నార్ పాత్రకు అక్కినేని సుమంత్,నందమూరి హరికృష్ణ పాత్రకి కళ్యాణ్ రామ్,చంద్రబాబు నాయుడు పాత్రలో దగ్గుబాటి రానా, హీరోయిన్ జయప్రద పాత్రలో హన్సిక మోత్వాని, సావిత్రి పాత్రలో నిత్యామీనన్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్రలో భరత్ రెడ్డి లు నటించారు.
అలా భారి తారాగణంతో విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాకి క్రిష్ దర్శకత్వం వహించగా.. ఎన్బికె ఫిలిమ్స్,వారాహి చలణ చిత్రం,విబ్రిమీడియా బ్యానర్లపై నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి,విష్ణు ఇందూరీలు నిర్మాతలుగా చేశారు. అలా భారీ అంచనాల మధ్య 2019 జనవరి 9న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది.అయితే సుమారు 70 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా వచ్చినప్పటికీ అనుకున్నంత కలెక్షన్లు అందుకోలేకపోయింది. అలా సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా చూసిన నందమూరి తారక రామారావు అభిమానులు ఆయన జీవితంలో పడ్డ కష్టాలను కళ్ళారా చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. అలా ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి ఎలా వచ్చారు ఆయన పడ్డ కష్టాలు ఏంటో చూపించారు