మంచు ఫ్యామిలీ వివాదం మలుపులు తిరుగుతూ వెళ్తోంది. ఆ వివాదంలో మోహన్ బాబు ఆవేశంతో టీవీ9 జర్నలిస్ట్‌పై దాడి చేసిన విషయం తెల్సిందే. మంచు ఫ్యామిలీలో వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మొన్నటి వరకు నాలుగు గోడల మధ్య ఉన్న వీళ్ళ గొడవ ఇప్పుడు రచ్చకెక్కడం చర్చనీయాంశమైంది. మంచు మనోజ్, తండ్రి మోహన్ బాబు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఇంతటితో ఆగలేదు.ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మరో వైపు మోహన్ బాబు ప్రశ్నించేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులపై చేయి చేసుకోవడం రచ్చ రచ్చగా మారింది. ఇదిలా ఉంటే యాక్టర్ మోహన్ బాబు జర్నలిస్టుపై దాడి చేసినందుకు బుధవారం మోహన్ బాబుపై 118 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం లీగల్ ఒపీనియన్ తీసుకున్న పోలీసులు మోహన్ బాబుపై BNS 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో మీడియా పై దాడి ఘటనలో నటుడు మోహన్ బాబు టీవీ9 కి లిఖితపూర్వకంగా క్షమాపణలు తెలిపారు. నా కుటుంబ ఘటన ఇలా పెద్దదిగా మారి టీవీ9 ను జర్నలిస్టులను ఆవేదనకు గురి చేసినందుకు చింతిస్తున్నాను.ఘటన అనంతరం 48 గంటల పాటు ఆసుపత్రి పాలు కావడం వలన వెంటనే స్పందించలేకపోయాను. ఆరోజు ఆవేశంలో జరిగిన ఘటనలో జర్నలిస్టు గాయపడటం చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి టీవీ9 కి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను అని పేర్కొన్నారు.అయితే ఈ దాడిలో గాయపడిన జర్నలిస్టుకు ఈ రోజు యశోద ఆస్పత్రి వైద్యుల బృందం సర్జరీ పూర్తి చేశారు. మైక్ తో రంజిత్ తలపై బలంగా కొట్టారు. దీంతో కంటికి, చెవికి మధ్య మూడు లెవెల్స్‌లో ఫ్రాక్చర్లు అయ్యాయి. మూడు చోట్ల జైగోమాటిక్ ఎముక విరిగింది.దీంతో సర్జరీ చేసిన వైద్యులు రంజిత్ జైగోమాటిక్ బోన్‌ను సరిచేశారు. ఫ్రాక్చర్లు అయిన చోట సర్జరీ చేసి.. స్టీల్ ప్లేట్ అమర్చినట్లు యశోద ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన్ను అబ్జర్వేషన్ ఉంచామని తెలిపారు.