వామ్మో: ఆ విషయంలో భర్తను దూరం పెట్టిన టాలీవుడ్ హీరోయిన్..!
తెలుగు ,తమిళ్ ,కన్నడ ,హిందీ వంటి చిత్రాలలో నటించిన ఈ అమ్మడు స్పెషల్ సాంగ్ లలో కూడా కనిపించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ రంభ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. రంభ తన భర్తకు ఉన్న సోషల్ మీడియాని ఫాలో అవ్వని తెలియజేసింది.. అది కూడా ఒక స్టార్ హీరోయిన్ వల్లే అంటూ తెలియజేసింది రంభ.ఈ విషయం విన్న అభిమానులు కొంత ఆశ్చర్యపోతున్నప్పటికీ ఆమె అసలు విషయాన్నీ తెలియజేసింది.
ఒక స్టార్ హీరోయిన్ వల్లే తన భర్తను అన్ ఫాలో చేశానని వెల్లడించింది. ఇటీవలే ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. హీరోయిన్ తమన్నా వల్లే తాను అన్ ఫాలో తన భర్తని అవుతున్నానని తెలిపింది.. తన భర్త హీరోయిన్ తమన్నాను ఫాలో అవుతున్నాడని అందుకే తన భర్తను తాను ఫాలో అవ్వడంలేదని రంభ సరదాగానే తెలియజేసింది. ముఖ్యంగా తమన్నా నటించిన చిత్రాలను ఎక్కువగా చూస్తారని అలాగే జైలర్లోని సాంగ్ కూడా బాగా నచ్చడంతో తమన్నాని ఫాలో అవుతున్నాడని తెలిపింది ఫన్నీగా రంభ. అయితే గత కొంతకాలంగా రంభ తన భర్త నుంచి విడిపోతోందని రూమర్స్ రావడానికి ఈ విషయంతో చెక్ పెట్టిందని అభిమానుల సైతం తెలియజేస్తున్నారు..