మంచు ఫ్యామిలీ గొడవలు ఇండస్ట్రీలో ఎంత దుమారం సృష్టిస్తున్నాయో చెప్పనక్కర్లేదు. ఇక ఇందులో మీడియా కూడా సమాచారం తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళగా మోహన్ బాబు వారిపై చేయి చేసుకోవడం మరింత దుమారం సృష్టించింది. మోహన్ బాబు పై,విష్ణు పై, మనోజ్ పై కేసులు కూడా బుక్ చేశారు. అంతేకాదు ఇదంతా విష్ణు కన్నప్ప మూవీ ప్రమోషన్ కోసం ఇలా మీడియాలో హాట్ టాపిక్ అయితే సినిమా ప్రమోషన్ కూడా అవుతుంది అనే ఉద్దేశంతో ఇలా చేశారని హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ మోహన్ బాబు పై కేసు పెట్టారు. ఇలా గత నాలుగైదు రోజుల నుండి ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే.. మోహన్ బాబు కష్టార్జితంతో కట్టుకున్న జలు పల్లి లోని ఇల్లు పైనే అందరి కన్ను ఉంది అని తెలుస్తోంది.అయితే ఈ ఇంటిని తనకు రాసి ఇవ్వాలని మనోజ్ గొడవ చేయడంతో ఈ గొడవ బయటికి వచ్చినట్టు మాత్రం వినిపిస్తున్నాయి.
అయితే ఆస్తి గొడవలు వినిపిస్తున్న వేళ తాజాగా మోహన్ బాబు వీలునామా ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. మరి మోహన్ బాబు వీలునామాలో ఎవరికి ఎంత ఆస్తి రాసిచ్చారో ఇప్పుడు చూద్దాం.మోహన్ బాబు తాను సంపాదించిన ఆస్తిలో మంచు విష్ణుకి శ్రీలక్ష్మి పిక్చర్స్ తో పాటు తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలను ఆస్తి కింద రాసిచ్చారట. ఇక మంచు లక్ష్మి కి కొన్ని స్థిరా చరాస్తులతో పాటు ఫిలింనగర్లో ఉన్న లగ్జరీ ఇల్లును ఇచ్చారట.ఇక మనోజ్ కి మాత్రం వీరిద్దరి కంటే తక్కువ ఆస్తి ఇచ్చారట.ఎందుకంటే ఈయనకు హైదరాబాద్ శివార్లలో ఉన్న ఒక ఇల్లు మాత్రమే ఇచ్చారట.
దీంతో ఆస్తి విషయంలో తండ్రి తనకు అన్యాయం చేశారని భావించిన మనోజ్ జల్ పల్లి లోని మోహన్ బాబు ఉంటున్న నివాసాన్ని తనకి రాసి ఇవ్వమని గత కొద్దిరోజులుగా గొడవ చేస్తున్నారట.కానీ మోహన్ బాబు మాత్రం నేను చనిపోయేంతవరకు ఇది నాతోనే ఉంటుంది. ఈ ఇల్లు నేను ఎవరి పేరునా రాయను అని తెగేసి చెప్పారట.దీంతో అక్కయ్యకు,అన్నయ్యకు ఆస్తులు ఎక్కువగా ఇచ్చి నాకు మాత్రం ఆస్తులు ఇవ్వడంలో అన్యాయం చేశావు అని మనోజ్ తిరగబడడంతోనే ఈ గొడవ అంతా జరిగిందని తెలుస్తోంది.ఇక ఈ సోషల్ మీడియాలో బయటపడ్డ వీలునామని చూసి చాలామంది నెటిజన్లు కూడా మనోజ్ కి ఆస్తి విషయంలో మోహన్ బాబు అన్యాయం చేశారు.. అందుకే ఈ గొడవలు జరుగుతున్నాయి అంటూ నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు