అఖండ 2 వర్సెస్ సంబరాలు ఏటిగట్టు .. 2025 దసరాకి భలే పోటీ గురు..!
ఇక సంబరాల ఏటి గట్టని హనుమాన్ సినిమాని నిర్మించిన ప్రైమ్ షో నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో తెరక్కింకచ్చబోతుంది .. ఇక గత రాత్రి రామ్ చరణ్ ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ వీడియోను రిలీజ్ చేయగా .. అందులో ఒక మానవతీత శక్తిని ఎదుర్కోవడానికి సామాన్యుడు చేసే పోరాటం ఎంతటి రక్తపాతానికి దారితీస్తుందో అనే పాయింట్ మీద ఈ సినిమా స్టోరీ ఉండబోతున్నట్టు తెలుస్తుంది . ఇక ఈ సినిమాకు సంబంధించిన క్లూస్ ఎక్కువగా ఇవ్వలేదు కానీ సిక్స్ ప్యాక్ బాడీ తో సాయిధరమ్ తేజ్ ఎంతో మాస్ లుక్ లో కనిపించాడు .. అంజనీష్ లోక్నాథ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ , సాంకేతికత వర్గం పనితీరు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు ఉన్నాయి .. శ్రీకాంత్ , సాయికుమార్ , జగపతిబాబు వాయిస్ ఓవర్ నేపథ్యం వినిపించాయి.
అఖండ 2 తాండవం గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు .. అఖండ మొదటి పార్ట్ లో సెకండ్ హాఫ్ కే ఎంతో కీలకమైన అగోర పాత్ర ఈసారి పూర్తి విశ్వరూపం చూపించబోతుంది .. అలాగే తమన్ బిజిఎం మీద అంచనాలు ఆల్రెడీ పిక్స్ లో ఉన్నాయి .. దర్శకుడు బోయపాటి శ్రీను ఈసారి మరింత శక్తివంతంగా స్క్రిప్ట్ను రెడీ చేస్తున్నట్టు టాక్ . ఈసారి దసరా కాంపిటేషన్ మరింత రంజుగా ఉండేలా కనిపిస్తుంది . అఖండ 2 తాండవం , సంబరాలు ఏటిగట్టు రెండు సినిమాలు సెప్టెంబర్ 25నే రాబోతున్నాయి .. కానీ ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులు కారణంగా కచ్చితంగా మాట మీద ఉంటారా అంటే మాత్రం చెప్పలేం .. ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఏం జరిగిందో చూడాలి .