పక్కా ప్లాన్ తోనే "శుక్రవారం" బన్ని అరెస్ట్..రేపు,ఎల్లుండి కోర్టు సెలవు..అదే నిజమైతే మూడు రోజులు బన్నీ కి చుక్కలే..!?
కాగా సోషల్ మీడియాలో ఇప్పుడు బన్నీ ఫాన్స్ అల్లు అర్జున్ అరెస్టుపై తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు . కావాలని కొందరు పెద్దమనుషులు, రాజకీయ పలుకుబడితో ఇలా చేస్తున్నారు అని శుక్రవారం రోజు అరెస్ట్ చేస్తే రేపు సెకండ్ శనివారం.. అరెస్ట్ కోసం బెయిల్ తీసుకోవడానికి కూడా వీలు ఉండదని ఆ పక్క రోజు ఆదివారం కనుక బన్నీని మూడు రోజులు కూడా రిమాండ్ లో ఉంచే విధంగానే పక్కా ప్లాన్ తో ఇలా కావాలనే కొందరు పెద్ద మనుషులు పగతో చేస్తున్నారు అంటూ వాపోతున్నారు.
అంతేకాదు ఒకవేళ బన్నీ అభిమానులు మాట్లాడుతున్నట్లు అదే నిజమైతే మాత్రం అల్లు అర్జున్ కెరీర్ కు అది భారీ మైనస్ అంటున్నారు సినీ విశ్లేషకులు. పుష్ప2తో పాన్ ఇండియా లెవెల్ లో రికార్డ్స్ బ్రేక్ చేసిన అల్లు అర్జున్ ఇండియన్ బాక్సాఫీ హిస్టరీ తిరగరాశారు. రిలీజ్ అయిన ఆరు రోజుల్లోనే 1000 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ మూవీగా తన పుష్ప2 ని నిలబెట్టుకున్నాడు . ఫ్యాన్స్ కి ఈ ఆనందం ఎక్కువ కాలం నిలవలేకపోయింది . ఇంతలోనే బన్నీ అరెస్టు అయ్యాడు అంటూ వార్తలు రావడం స్నేహారెడ్డి కన్నీళ్లు పెట్టుకోవడం అందరికీ చాలా చాలా బాధగా అనిపిస్తుంది . అయితే కొంతమంది అల్లు అర్జున్ హేటర్స్ మాత్రం దేవుడు ఉన్నాడు.. ఆ కుటుంబానికి న్యాయం చేస్తాడు అంటూ బన్నీ అభిమానులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. అటు సినిమా ఇండస్ట్రీలో ఇటు రాజకీయాలలో అల్లు అర్జున్ అరెస్ట్ చర్చనీయాంశంగా మారింది..!