అల్లు అర్జున్ విషయంలో పోలీసులు టూమచ్.. ఏకంగా బెడ్రూమ్ వరకు..?

Divya
పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ అభిమానులతో చూడడానికి సంధ్య థియేటర్ వద్దకు వెళ్ళగా అక్కడ తొక్కిసలాట జరగడంతో ఈ తొక్కి సలాట ఘటనలో ఏకంగా మహిళ మృతి చెందింది దీంతో అల్లు అర్జున్ పై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కావడంతో ఇటీవల అల్లు అర్జున్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలోని పెను సంచలనంగా మారింది. ఈ విషయం తెలిసి అటు ఫ్యాన్స్ కూడా చాలా ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ ఆ బాధిత కుటుంబాలకు సైతం అండగా ఉంటానని అందుకు తగ్గట్టుగా ఏ పనైనా చేయడానికి సిద్ధమే అని కూడా తెలియజేశారు.

అయితే అల్లు అర్జున్ వెళ్లిపోయిన తర్వాత సంధ్య థియేటర్లో ఇలాంటి ఘటన జరిగిందని అందుకు కారకులు థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్, అతని సిబ్బంది అంటూ పోలీసులు సైతం కొన్ని సెక్షన్స్ కింద పలు రకాల కేసులు కూడా నమోదు చేశారట. దీంతో ఇందులో విచారించడానికి అల్లు అర్జున్ సైతం అరెస్టు చేసే క్రమంలో చిన్న వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు మా డ్యూటీ మేము చేస్తున్నామని చెబుతున్నారట. మీ డ్యూటీ మీరు చేయడం కరెక్టే కానీ.. తనను తీసుకువెళ్లడం తప్పులేదు తన బెడ్ రూమ్ వరకు వచ్చేయడం చాలా టూమచ్ అంటూ అల్లు అర్జున్ కూడా ఈ విషయం పైన అసహనాన్ని తెలియజేశారు.

అయితే ఈ విషయం పైన అల్లు అర్జున్ భార్య టెన్షన్ పడుతూ ఉండడంతో తన భార్యకు ధైర్యాన్ని చెబుతూ ఏమి కాదని ప్రేమగా ముద్దు పెట్టి మరి పోలీసులతో వెళ్లిపోయారు అల్లు అర్జున్. అయితే ఆ వెంటనే అల్లు అరవింద్ కూడా అల్లు అర్జున్ తో పాటు కారులో వెళ్లినట్లు సమాచారం. బన్నీ అరెస్ట్ కావడంతో అతని తరఫున న్యాయవాది హైకోర్టులో సైతం అత్యవసర పిటిషన్ కూడా దాఖలు చేసినట్లు సమాచారం. మరి ఈ విషయం ఎందాక వెళ్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: