బాహుబలి 2.. ఆర్ఆర్ఆర్.. కల్కి : ఒక్క దెబ్బతో అన్ని రికార్డులు ఔట్..,?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ఇప్పటివరకు 1000 కోట్ల కలెక్షన్స్ మార్క్ ను అందుకున్న సినిమాల లిస్టులో నాలుగు మూవీలు నిలచాయి. మొదటగా తెలుగు సినీ పరిశ్రమ నుండి రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి 2 సినిమా 1000 కోట్ల మార్క్ కలెక్షన్లను అందుకుంది. ఇకపోతే ఈ సినిమా 1000 కోట్ల మార్క్ ను అందుకోవడానికి 10 రోజుల సమయం పట్టింది. 10 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్ల మరి ను అందుకుంది.

ఇక ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా తెలుగు సినీ పరిశ్రమ నుండి 1000 కోట్ల కలెక్షన్లను అందుకుంది. ఇకపోతే ఈ సినిమా 1000 కోట్ల మార్క్ ను అందుకోవడానికి 16 రోజుల సమయాన్ని తీసుకుంది. 16 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్లను అందుకుంది. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమా 1000 కోట్ల కలెక్షన్ల మార్క్ ను అందుకుంది. ఇకపోతే ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్ల మార్క్ ను అందుకోవడానికి 24 రోజుల సమయాన్ని తీసుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా పుష్ప పార్ట్ 2 మూవీ 1000 కోట్ల కలెక్షన్లను అందుకుంది.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఇక ఈ సినిమా కేవలం 7 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 1000 కోట్ల కలెక్షన్లను అందుకుంది. దానితో ఈ మూవీ ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి 1000 కోట్ల కలెక్షన్లను అత్యంత తక్కువ రోజుల్లో అందుకున్న సినిమాల లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: