అల్లు అర్జున్ :మద్దతు పెరుగుతోందిగా.. హీరో నాని ట్విట్ వైరల్..!
దీంతో అల్లు అర్జున్ కూడా ఆ కుటుంబానికి జరిగిన అన్యాయానికి చింతిస్తున్నాను అంటూ తెలియజేస్తూ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటానని కూడా ఒక ప్రకటన తెలియజేశారు. అయితే ఇదంతా సర్దు మొరుగుతుంది అనుకున్న సమయంలో తాజాగా చిక్కడపల్లి పోలీసులు వచ్చి అల్లు అర్జున్ అరెస్టు చేయడం జరిగింది. దీంతో చాలామంది సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు అభిమానులు కూడా తెలంగాణ ప్రభుత్వం చేసిన పనిని తప్పుపడుతున్నారు.. ఇప్పుడు తాజాగా నాచురల్ స్టార్ నాని కూడా పోలీసులు ప్రభుత్వం పైన ఫైర్ అయ్యారు.
నాని తన ట్విట్టర్ నుంచి స్పందిస్తూ.. సినిమా వ్యక్తులకు సంబంధించిన ఎలాంటి విషయంలోనైనా ప్రభుత్వ అధికారులు, మీడియా ఉత్సాహం సామాన్య ప్రజల పైన కూడా ఉండాలని కోరుకుంటున్నాను అంటు తెలిపారు. థియేటర్ ఘటన దురదృష్టకమని మనం ఇలాంటి ఘటన నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది పలు రకాల జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ ఇలాంటివి జరగకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇది మన అందరి తప్పు దీనికి ఒక వ్యక్తి బాధ్యత వహించడు అంటూ అల్లు అర్జున్ సపోర్టుగా న్యాచురల్ స్టార్ నాని ట్విట్ చేయడంతో ఇప్పుడు ఈ విషయం మరొకసారి హార్ట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్ కి మద్దతుగా తెలియజేస్తున్నారు.